ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌కు వెళ్ళడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల రామ్‌చరణ్‌కు ఉత్తమ నటుడి అవార్డు రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ హీరోగా రామ్‌చరణ్ పేర్కొన్నారు. బెస్ట్ యాక్టర్‌గా హాలీవుడ్ క్రిటిక్ అవార్డు కూడా దక్కింది. దానితో అక్కడి మీడియా రామ్ చరణ్‌ను ఫోకస్ చేసింది. కానీ ఎక్కడా ఎన్.టి.ఆర్. ఎందుకు రాలేదు. అనేది మాత్రం చరణ్ చెప్పలేదు. కేవలం తను చెప్పాలనుకున్నది చెప్పాడు. దాంతో తెలుగు పరిశ్రమలో రెండు వర్గాల మధ్య పోరుగా సోషల్ మీడియాలో ఎన్.టి.ఆర్.కు అన్యాయం చేశారంటూ వార్తలు రచ్చ చేశాయి.
కానీ నిన్ననే ఎన్.టి.ఆర్. 30వ సినిమా నిర్మిస్తున్న యువసుధా ఆర్ట్స్ సంస్థ త్వరలో ఎన్.టి.ఆర్. యు.ఎస్.ఎ. వెళుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఫైనల్లీ కంగ్రాట్యులేషన్ తారక్.. అంటూ పులి పడుకుంది కదాని ముందు వచ్చి డాన్స్‌లు వేయకూడదు.. అంటూ సెటైరిక్‌గా పెట్టారు. హాలీవుడ్ క్రిటిక్ అవార్డు అకాడమీ నుంచి ఎన్.టి.ఆర్.కు ప్రత్యేక ఆహ్వానంగా వున్న పోస్ట్‌ను కూడా పోస్ట్ చేశారు. దీనితో ఫ్యాన్స్ మధ్య వున్న అపోహలు తొలగిపోయినట్లే అయిందన్నమాట.