తమ్ముడి కడచూపుకు వెళ్లలేదు.. సంస్మరణ సభకు వచ్చిన రవితేజ
టాలీవుడ్ హీరో రవితేజ మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన సోదరుడు భరత్‌ను చివరి చూపు చూసేందుకు కూడా వెళ్లని ఆయన.. బుధవారం హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమా
టాలీవుడ్ హీరో రవితేజ మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన సోదరుడు భరత్‌ను చివరి చూపు చూసేందుకు కూడా వెళ్లని ఆయన.. బుధవారం హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి హాజరై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచారు. అంతేనా.. తాను, తన కుటుంబ సభ్యులు చివరి చూపుకు ఎందుకు రాలేదో కూడా వివరణ ఇచ్చారు.
సంస్మరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, తన సోదరుడిని ఆ స్థితిలో చూడలేకే చివరి చూపుకు వెళ్లలేదని తెలిపాడు. తమ్ముడంటే ఎవరికి ప్రేమ ఉండదని అడిగాడు. తమ భావాలేంటో తెలుసుకోకుండా తమపై అవాస్తవ కథనాలు ప్రచురించడం సరైన విధానం కాదని రవితేజ చెప్పాడు.
మీడియా ఇష్టం వచ్చినట్లు రాయొద్దని కోరాడు. అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే రవితేజ సమాధానమివ్వలేదు. అంత్యక్రియల రెమ్యునరేషన్ విషయంపైనా రవితేజ నోరు మెదపలేదు. మీడియా సమావేశం మధ్యలోనే రవితేజ అసహనంగా వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మరోవైవు... రవితేజను మీడియా ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో హీరో అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పమని, మేం ఏది చెప్తే అది రాసుకోవాలని వారు హెచ్చరించారు.