Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంకన పందిపిల్లను పెట్టుకుని ఏటీఎం క్యూలో నిలబడిన రవిబాబు.. ఎందుకబ్బా..?

విభిన్న సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో రవిబాబు ఒకరు. 'అల్లరి' సినిమా నుంచి రవిబాబు దర్శకత్వం విభిన్నంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అదిగో'. ఇందులో ప్

Advertiesment
#Ravibabu at an ATM in Srinagar Colony
, బుధవారం, 23 నవంబరు 2016 (16:06 IST)
విభిన్న సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో రవిబాబు ఒకరు. 'అల్లరి' సినిమా నుంచి రవిబాబు దర్శకత్వం విభిన్నంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అదిగో'. ఇందులో ప్రధాన పాత్రను ఓ పందిపిల్ల పోషిస్తోంది. ఇందుకోసం ఆయన పందిపిల్లను పెంచుతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'అదిగో'ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు రవిబాబు.
 
ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎంల వద్ద ప్రజలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. తాను పెంచుకుంటున్న పందిపిల్లను చంకన వేసుకుని ఏటీఎం వద్ద రవిబాబు ప్రత్యక్షమైనాడు. నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పనిలో పనిగా చిత్ర ప్రచారం కూడా పూర్తవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా ఉంది. తాజాగా రవిబాబు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఆక‌ర్షించేందుకు చంకలో పంది పిల్లతో ఆయ‌న ఏటీఎం ముందు క్యూలో నిల‌బ‌డడం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి ఖైదీ 150 సినిమా ఆడియో: పవన్ కల్యాణ్ హాజరవుతారా? డుమ్మా కొడతారా?