Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊపేస్తున్న చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' పాటలు.. నేడు "రత్తాలు.. రత్తాలు" ఐటం సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 150వ చిత్రం కావడంతో 'చిరు' ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమిళ సినిమాను 'కత్తి' రీమెక్‌గా

Advertiesment
ఊపేస్తున్న చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' పాటలు.. నేడు
, శనివారం, 31 డిశెంబరు 2016 (09:10 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 150వ చిత్రం కావడంతో 'చిరు' ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమిళ సినిమాను 'కత్తి' రీమెక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను వినూత్నంగా చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆడియో విడుదల లేకుండానే పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలను యూ ట్యూబ్‌లో విడుదల చేశారు.
 
ఈ పాటలకు శ్రోతల నుండి అనూహ్య స్పందన వస్తోంది. 'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు' పాటను 7 మిలియన్‌ల మంది చూడగా 'సుందరీ..' పాట 4 మిలియన్‌ల వ్యూస్‌ చేరువవుతోంది. లేటెస్ట్ గా విడుదల చేసిన 'యు అండ్‌ మి' పాట అప్పుడే ఒక మిలియన్ వ్యూస్ దాటేస్తోంది.
 
ఈ నెల 31న 'రత్తాలు.. రత్తాలు' అనే ఐటమ్‌ సాంగ్‌తో పాటు.. చిత్రంలోని ఇతర పాటలన్నింటినీ యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత పాటలన్నీ యూట్యూబ్‌ జూక్ బాక్స్‌లో అందుబాటులోకి వస్తాయి. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 4వ తేదీన విజయవాడలో అట్టహాసంగా చేయనున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాహం... ఇంకా పలువురు భామలు...