Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ఎనర్జీకి బన్నీ ఫర్ఫెక్ట్ మ్యాచ్ : రష్మిక మందన్నా

Advertiesment
Rashmika Mandanna

ఠాగూర్

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (09:47 IST)
హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్రపరిశ్రమలోని పలువురు హీరోల గురించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, తనకుండే ఎనర్జీకి తగిన వ్యక్తి అల్లు అర్జున్ అంటూ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఆమె ప్రధాన పాత్రను పోషించిన ఛావా చిత్రం విడుదలకానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో రష్మిక మందన్నా పాల్గొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణబీర్ కపూర్‌లతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల తాను చేసిన చిత్రాల్లోని హీరోలు అందరూ ఎతో మంచి వ్యక్తులను ప్రశంసించారు. స్నేహభావంతో, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్యంగా, అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ ఫర్ఫెక్ట‌గా మ్యాచ్ అవుతుందని, ఆయనతో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
 
అలాగే, బాలీవుడ్ నటుడు రణవీర్‌కు తన నాన్సెన్స్ నచ్చదన్నారు. కేవలం పాత్రల గురించి తప్ప ఇతర విషయాలు ఏవీ మాట్లాడుకోమని, అంతా ప్రొఫెషనల్‌గా ఉంటామన్నారు. ఇక విక్కీ విషయానికి స్తే ఆయన అద్భుతమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారన్నారు. అలాంటి వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి