Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రణ్ బీర్ కపూర్‌‌పై "గెట్ లాస్ట్" అంటూ తిట్ల వర్షం కురిపించిన హాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్‌కు లవర్ బాయ్ ఇమేజ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. ఈ హీరో అంటే మనదేశంలోని అమ్మాయిలు పడిచస్తారు. ఎందుకంటే అతను మనకు బాగా తెలిసిన హీరో కాబట్టి. కానీ ఆస్కార్ అవార్డు విజేత

Advertiesment
రణ్ బీర్ కపూర్‌‌పై
, బుధవారం, 24 ఆగస్టు 2016 (14:32 IST)
బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్‌కు లవర్ బాయ్ ఇమేజ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. ఈ హీరో అంటే మనదేశంలోని అమ్మాయిలు పడిచస్తారు. ఎందుకంటే అతను మనకు బాగా తెలిసిన హీరో కాబట్టి. కానీ ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మన్ మాత్రం ఈ హీరో ముఖం మీదే 'గెట్ లాస్ట్' అంటూ చిరాకు పడిందంట. అంత మాట ఎందుకందబ్బా అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే పూర్తి కథనం చదవాల్సిందే. 
 
తాజాగా సీ.ఎఎ.ఎన్ న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ తన హలీవుడ్ చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. "ట్రిబెకా" చిత్రోత్సవంలో ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మన్ ఫోన్‌లో మాట్లాడుతూ ఏడుస్తున్నట్టు కనిపించదట. అంతలో ఈ హీరో గారు ఆమె వెనుక పరిగెత్తాడట. తాను అభిమానించే నటిని అభినందించాలని ఆమె దగ్గరకు చేరుకుని "ఐ లవ్ యువర్..." అని మాట పూర్తిచేసే లోపే ఆమె తలతిప్పి చూసి కోపంగా "గెట్ లాస్ట్" అని అరిచిందట. అంతే ఆమె ఆ మాట అనేసరికి రణ్ బీర్ హృదయం ముక్కలైపోయిందట. ఆ చేదు క్షణాలు ఇంకా తనను వెంటాడుతూనే ఉన్నాయని చెబుతున్నాడు రణ్ బీర్. 
 
ఇంతకూ... రణ్ బీర్ ఆమెతో చెప్పాలనుకున్న పూర్తి వాక్యం ఏమిటంటే... "ఐ లవ్ యువర్ వర్క్" అని. ఆ మాట పూర్తిగా వినకుండానే ఆమె అంతలా మండిపడిందట. ఈ అనుభవం నుండి తేరుకోకముందే ఈ హీరోకి మరో చేదు అనుభవం ఎదురైంది. "యే దిల్ హై ముష్కిల్" సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్వింటిన్ టారంటినోను కలిసి ఫొటో దిగాలని ఈ హీరో ముచ్చటపడ్డాడట. వెంటనే... డైరెక్టర్ వెంట పరుగెత్తుకుంటూ వెళ్లినా... తనను పట్టించుకోకుండానే ఆయన కారెక్కి వెళ్లిపోయాడట. దీంతో నచ్చిన దర్శకుడితో ఫోటో దిగాలని ప్రయత్నించిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయిందని తెగ బాధపడిపోయాడు ఈ బాలీవుడ్ హీరో.ఈ స్థాయిలో మన బాలీవుడ్ లవర్ బాయ్ కి హాలీవుడ్ స్టార్స్‌తో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పెద్ద' నయీమ్ పోయాడు.. కానీ 'పిల్ల' నయీమ్‌లు వేలల్లో ఉన్నారు... నట్టి భయంభయం