బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు రణ్ బీర్ కపూర్-అలియాభట్ ఎంగేజ్‌మెంట్ బుధవారం జరుగనున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్ 29న రణ్ బీర్ కపూర్-అలియాభట్ తమ తమ కుటుంబసభ్యులతో కలిసి రాజస్థాన్‌లోని రణతంభోర్ పార్కుకు సమీపంలోని సవాయి మధోపూర్ కు వెళ్లారు. మరోవైపు రణ్‌బీర్-అలియా రాజస్థాన్ కు బయలు దేరే కొన్ని గంటల ముందే రణ్ వీర్ సింగ్-దీపికాపదుకొనే పింక్ సిటీకి వచ్చేశారు.
ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులంతా ఒకేసారి పింక్ సిటీకి చేరుకుంటుండటంతో నిశ్చితార్థ వార్తలు నిజమేనని అంతా అనుకున్నారు. ఈ న్యూస్ పై రణ్ బీర్ అంకుల్ రణ్ ధీర్ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
రణ్ బీర్ కపూర్-అలియాభట్ ఎంగేజ్‌మెంట్ వార్తలు వట్టి పుకార్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే మేం కూడా వారితోనే కలిసి వెళ్లేవాళ్లం. రణ్ భీర్, అలియా, నీతూ న్యూ ఇయర్ కోసం హాలీడే ట్రిప్ కు వెళ్లారు. నిశ్చితార్థం వార్తలు వాస్తవం కాదు అని నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.