బాలీవుడ్ స్టార్స్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది.
ఇన్స్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ పోస్ట్ చేసిన పెళ్లి ఫొటోపై స్పందిస్తూ, 'ఇద్దరికీ శుభాకాంక్షలు. ఇద్దరూ అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలి' అని తెలిపింది.
కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ఇద్దరూ దాదాపు 6 ఆరేళ్ల పాటు రిలేషన్ షిప్లో ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ దూరమయ్యారు. అనంతరం గత డిసెంబర్లో హీరో విక్కీ విశాల్‌ను కత్రిన పెళ్లాడింది. ఇప్పుడు అలియాను రణబీర్ వివాహం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం ముంబైలో వేడుకగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.