దుమ్మురేపుతున్న 'ఘాజీ' వసూళ్లు... ఊపిరి పీల్చుకుంటున్న నిర్మాత
దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం 'ఘాజీ' మంచి వసూళ్లను రాబడుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ డ్రామా కావడం, కథనం విజువల్స్‌తో సినిమాను ఆసక్తికరంగా రూపొందించడంతో రెండో వారంలో సైతం
దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం 'ఘాజీ' మంచి వసూళ్లను రాబడుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ డ్రామా కావడం, కథనం విజువల్స్‌తో సినిమాను ఆసక్తికరంగా రూపొందించడంతో రెండో వారంలో సైతం చిత్ర కలెక్షన్లు చాలా స్టడీగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో అయితే ప్రేక్షకులు 'ఘాజీ'కి బ్రహ్మరథం పడుతున్నారు.
శుక్రవారం 26,990 డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా శనివారం అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా 100 శాతం పెరుగుదలతో 55,944 డాలర్లను వసూలు చేసింది. దీంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 4.22 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక హిందీ వెర్షన్ సాధించిన రూ.13.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు కలుపుకుని ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.32.5 కోట్లు వసూలు చేసింది.
పైగా వచ్చే శుక్రవారం వరకు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో చెప్పుకోదగ్గ భారీ సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అవకాశమని చిత్ర నిర్మాత పీవీపీ తెలియజేస్తున్నారు. చూసిన వారంతా మెచ్చుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని సోమవారం జరిగిన సక్సెస్ మీట్‌లో వెల్లడించారు.