Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఫైట్స్ నిజమైతే.. ప్రభాస్ నన్ను చంపేసేవాడే.. ఇద్దరిలో ఒకరే బతికేవాళ్ళం: భల్లాలదేవ రానా

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించి, ఈనెల 28వ తేదీన విడుదల కానున్న చిత్రం బాహుబలి 2. ఈ చిత్రంలో ప్రభాస్, దగ్గుబాటి రానాలు హీరో, విలన్‌లుగా నటించారు. ఇందులో తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరా

Advertiesment
Baahubali 2
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:41 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించి, ఈనెల 28వ తేదీన విడుదల కానున్న చిత్రం బాహుబలి 2. ఈ చిత్రంలో ప్రభాస్, దగ్గుబాటి రానాలు హీరో, విలన్‌లుగా నటించారు. ఇందులో తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్‌లు కీలక పాత్రలను పోషించారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్‌ను కోట్లాది మంది వీక్షిస్తున్నారు. ట్రైలర్‌లోనే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటే.. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటాయోనన్న సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో రానా ఫోటోను ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఇటీవల రిలీజ్ చేశాడు. భారీగా పెంచిన కండలతో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న రానా అందర్నీ తెగ ఆకర్షిస్తూ ఉండటంతో ఈ లుక్‌పై రానా స్పందించాడు. 'బాహుబలి 2' చిత్రంలో అత్యంత కీలకమైన పోరాట సన్నివేశాల కోసం రేయింబవళ్లు శ్రమించినట్టు చెప్పారు. థ్రిల్ చేయడానికి తాను పడ్డ కష్టాన్ని యుద్ధ సన్నివేశాలల్లో చాలా సీరియస్‌గా నటించినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, యుద్ధ సన్నివేశాల విషయంలోనూ, హీరో ప్రభాస్ పోరాట సన్నివేశాల్లో సీరియస్‌గా నటించినట్టు కనిపించాం కానీ అలా చేయలేదు. క్షేత్రస్థాయిలో ఒకవేళ నిజంగా ఫైట్స్ అలా చేసి ఉంటే ఇద్దరిలో ఒకరు మాత్రమే బతికి ఉండేవాళ్లం. పోరాటాలు అంత భీకరంగా ఉంటాయి. తమను ఇన్వాల్వ్ చేస్తూ రాజమౌళి ఈ కథకు సంబంధించిన క్లైమాక్స్ తీస్తున్నప్పుడు తనను నిజంగానే ప్రభాస్ చంపివేసే విధంగా రాజమౌళి ప్రభాస్‌ను యుద్ధ సన్నివేశాలలో నటన పరంగా ఉత్తేజ పరిచినప్పుడు తామిద్దరిలో నిజంగా ఒక్కరు మాత్రమే బతుకుతామా అని అనిపించింది అంటూ రానా ఈసినిమా క్లైమాక్స్ గురించి వివరించాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్త మోసగాడు.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు.. తమిళ టీవీ నటి నందిత ఆరోపణ