మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా కలిసివున్న ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇద్దరు హీరో బ్రొమాన్స్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కొత్త సంవత్సరం సందర్భంగా రామ్ చరణ్‌తో కలిసివున్న ఫోటోను దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో షేర్ చసారు. ఇది వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని తేటతెల్లం చేస్తుంది. 
	 
	ఈ ఫోటోను షేర్ చేస్తూ గత 30 యేళ్లుగా కలిసే ఉన్నామంటూ "హ్యాపీ న్యూ ఇయర్ మ్యాన్" అంటూ కామెంట్స్ చేశారు. కాగా, బాల్యం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం తెల్సిందే.