Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?

బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా సేందకూట్టం''. ఈ చిత్రంలో రాజమౌళి 'బాహుబలి' సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనుంది.

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?
, మంగళవారం, 29 నవంబరు 2016 (16:48 IST)
బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా సేందకూట్టం''. ఈ చిత్రంలో రాజమౌళి 'బాహుబలి' సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనుంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ విశిష్టమైన రోల్‌లో కనిపిస్తుందని టాక్ వస్తోంది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్‌ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ ఇప్పటికే చేరినట్లు తెలుస్తోంది. 
 
విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  సూర్య సరసన కీర్తిసురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్‌, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది. ఇలాంటి పాత్రలెన్నో రమ్యకృష్ణకు వెల్లువెత్తుతున్నాయని.. అయితే శివగామి తనకు వచ్చే ఆఫర్స్‌లలో ఎంపిక చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రాండ్‌లెవెల్‌లో 4న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్... 9న చిత్రం విడుదల