నా భర్తతో విబేధాలా? అంత లేదు.. లీవు దొరికితే ట్రిప్పేస్తాం: బాహుబలి శివగామి
బాహుబలితో కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం అంత సంతృప్తికరంగా లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. 30 ఏళ్ల పాటు సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న రమ్యకృష్ణ.. బాహుబలి శివగామిగా క
బాహుబలితో కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం అంత సంతృప్తికరంగా లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. 30 ఏళ్ల పాటు సినీ కెరీర్‌ను కొనసాగిస్తున్న రమ్యకృష్ణ.. బాహుబలి శివగామిగా కనిపించి.. మంచి క్రేజ్ సంపాదించింది. కెరీర్ పరంగా రమ్య రాణిస్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా తన భర్త, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీకి ఆమె దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కృష్ణవంశీ-రమ్యకృష్ణ దంపతులు ప్రేమించి పెళ్లాడారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ, రమ్యల మధ్య విభేదాలున్నాయని అందుకే చెన్నైలో రమ్య, హైదరాబాదులో కృష్ణవంశీ ఉంటున్నారని టాక్ వచ్చింది. అయితే దీనిపై రమ్య స్పందించింది. తాను ప్రస్తుతం సినిమా.. సీరియల్ షూటింగులతో బిజీగా ఉన్నానని చెప్పింది.
తనకు తన భర్త పూర్తి స్వేచ్ఛనిచ్చారని.. భార్య ఆశయాలను, కోరికలను అర్థం చేసుకునే భర్త లభించడం చాలా అరుదు అని రమ్య అన్నారు. కృష్ణవంశీ గ్రేట్ అని.. తామిద్దరం చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించే వాళ్లమని తెలిపింది. ప్రస్తుతం కెరీర్ పరంగా తాము దూరంగా ఉన్నప్పటికీ... ఫోన్లో కలుస్తుంటామని.. అప్పుడప్పుడు కలుస్తామని, విరామం దొరికితే కుటుంబంతో కలిసి ట్రిప్పేస్తామని రమ్యకృష్ణ క్లారిటీ ఇచ్చింది.