శివగామి పాత్ర నాకు దక్కడం జీవితంలోనే పెద్ద లక్ః రమ్యకృష్ణ
బాహుబలి వంటి సినిమాల్లో చేసే అవకాశం లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. ఆ ఛాన్స్ అందరికీ రాదు. అది నాకే వచ్చినందుకు చాలాసంతోషంగా ఉందని రాజమాత శివగామి దేవి పాత్రధారిణి రమ్యకృష్ణ చెప్పారు. దానికి తోడుగా బాహుబలికి తానే హీరో అని రాజమౌళితో సహా అందరూ చెబుతుండటంతో
బాహుబలి వంటి సినిమాల్లో చేసే అవకాశం లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. ఆ ఛాన్స్ అందరికీ రాదు. అది నాకే వచ్చినందుకు చాలాసంతోషంగా ఉందని రాజమాత శివగామి దేవి పాత్రధారిణి రమ్యకృష్ణ చెప్పారు. దానికి తోడుగా బాహుబలికి తానే హీరో అని రాజమౌళితో సహా అందరూ చెబుతుండటంతో మాటలు రావటం లేదని అన్నారు. చిత్ర రంగంలో ఏడేళ్లుగా ఎలాంటి హిట్ కూడా రాని తనకు రాఘవేంద్రరావు లైఫ్ ఇచ్చారని, నీలాంబరి నుంచి శివగామి వరకు తన కెరీర్ సక్సెస్ కావడానికి ఆయన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. రాజమౌళి బ్లాక్ బస్టర్ బాహుబలితో నటనలో శిఖరస్థాయికి చేరుకున్న రమ్యకృష్ణ శివగామి పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పినప్పుడు గొప్ప క్యారెక్టర్ అనిపించింది కానీ ఇంత పెద్ద పేరు వస్తుందని మాత్రం ఊహించలేదనేశారు.
‘బాహుబలి’కి మీరే హీరో అని సోషల్ మీడియా ద్వారా చాలా మెసేజ్‌లు వచ్చినప్పుడు నాకైతే మాటల్లో ఎలా చెప్పాలో తెలియడంలేదు. నా ప్లేస్‌లో ఎవరు ఉన్నా హ్యాపీ ఫీలవుతారు. యాక్చువల్లీ నాకు ఏ క్యారెక్టర్ వస్తే అది చేసుకుంటూ వచ్చాను. నాకు సూట్ అయ్యే రోల్స్‌తోనే డైరెక్టర్స్ ఎప్రోచ్ అవుతారని నా నమ్మకం. అందుకే దాదాపు ఏ పాత్రకీ ‘నో’ చెప్పను. ‘బాహుబలి’కి అవకాశం రావడం నా లక్.
శివగామి పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పినప్పుడు గొప్ప క్యారెక్టర్ అనిపించింది. అయితే ఇంత పెద్ద పేరు వస్తుందని మాత్రం ఊహించలేదు. ‘బాహుబలి’ ఇంత పెద్ద సినిమా అవుతుందని కూడా అనుకోలేదు. సౌత్, నార్త్.. ఇలా అన్ని చోట్లా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలాంటి సినిమాల్లో చేసే అవకాశం లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. ఆ ఛాన్స్ అందరికీ రాదు.
ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ పాత్ర వచ్చినా అన్నీ బాగా కుదిరాయి. అప్పట్లో నీలాంబరి.. ఇప్పుడు శివగామి రెండూ మంచి పాత్రలే. నాకు వచ్చిన ఏ పాత్రని అయినా నేను హండ్రెడ్ పర్సంట్ డెడికేషన్‌తో చేస్తాను. నీలాంబరి కానీ, శివగామి కానీ నేను ఊహించలేదు. ఆ మాటకొస్తే ఇప్పటివరకూ నాకు ఫలానా రోల్ వస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆలోచించలేదు. ఏది కుదిరితే అది చేశా. ‘బాహుబలి’కి ఛాన్స్ రావడం నా లక్.
అప్పట్లో ఏ సినిమా వచ్చినా కాదనకుండా చేశా. ఏడేళ్లు సక్సెస్‌లు లేవు. విమర్శలు ఎదుర్కొన్నా. అప్పుడప్పుడూ కాన్ఫిడెన్స్ తగ్గేది. ఆ సమయంలో ‘మనకు మనమే ధైర్యం చెప్పుకోకపోతే ఎలా’ అనుకునేదాన్ని. కాన్ఫిడెన్స్ తెచ్చుకునేదాన్ని. చివరికి రాఘవేంద్రరావుగారి వల్ల నాకో హిట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి ‘శివగామి’ దాకా నా కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిందంటే ఆయనే కారణం.