Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#RanaDaggubati 20 యేళ్ళ క్రితం వచ్చివుంటే.. రానా కండలపై ఆర్జీవీ ట్వీట్

నిన్న "బాహుబలి 2" చిత్రంపై ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం దగ్గుబాటి రానా కండలపై ట్వీట్ చేశారు. 20 యేళ్ల క్రితం వచ్చివుంటే.. ఆర్నాల్డ్, స్టాలోన్ వంటి వారు ఉండేవారే కాదని పేర్కొ

Advertiesment
ramgopal verma
, సోమవారం, 1 మే 2017 (14:09 IST)
నిన్న "బాహుబలి 2" చిత్రంపై ట్వీట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం దగ్గుబాటి రానా కండలపై ట్వీట్ చేశారు. 20 యేళ్ల క్రితం వచ్చివుంటే.. ఆర్నాల్డ్, స్టాలోన్ వంటి వారు ఉండేవారే కాదని పేర్కొన్నారు. ఆర్జీవీ చేసిన ఈ తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
ఇప్పటికే మాహిష్మతి సామ్రాజ్యాన్ని, అందులోని వ్యక్తులను చూసి మైమరచిపోయి తనదైనశైలిలో ట్వీట్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఈసారి భళ్ళాల దేవుడిని పొగడ్తలతో ముంచెత్తాడు. 
 
"రానా... చిత్రంలో నువ్వు చూపిన పవర్ అత్యద్భుతం. ఒకవేళ బాహుబలి రెండో భాగం ఓ 20 సంవత్సరాల క్రితం వచ్చివుంటే, స్వార్జ్‌నెగ్గర్, స్టాలోన్‌లు నీ ముందు దిగదుడుపు అయ్యుండేవారు" అని రానా కండలను ప్రస్తావిస్తూ, ట్వీట్ చేశారు. 
 
మే ఒకటో తేదీ సోమవారం ఉదయం 9:45 గంటల సమయంలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయగా, ఆపై వెంటనే రానా స్పందిస్తూ, నమస్కారం పెడుతున్న ఎమోజీలు పోస్టు చేశాడు. ఈ ట్వీట్‌కు అనేక మంది రీ ట్వీట్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి పార్టీలో శ్రియా భూపాల్.. అల్లు శిరీష్‌తో కలిసి ఎంజాయ్.. సోషల్ మీడియాలో ఫోటోలు...