బర్త్ డే విషెస్.. వర్మ ఇలాక్కూడా చెప్తారా...? హే యామీ చూపులతో చంపేస్తున్నావే.. వర్మ ట్వీట్స్
రాంగోపాల్ వర్మ పేరు చెబితే ఇప్పుడు ఆయన సినిమాల కంటే ప్రస్తుతం ఎక్కువగా ట్విట్టర్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సినిమాలతో పాటు ఆయన రాజకీయాలు, వ్యక్తిగతాలు.. ఇలా తను ఏమనుకుంటే దాన్ని ధైర్యంగా ట్వీటేస్తారు. ఆ తర్వాత ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్
రాంగోపాల్ వర్మ పేరు చెబితే ఇప్పుడు ఆయన సినిమాల కంటే ప్రస్తుతం ఎక్కువగా ట్విట్టర్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సినిమాలతో పాటు ఆయన రాజకీయాలు, వ్యక్తిగతాలు.. ఇలా తను ఏమనుకుంటే దాన్ని ధైర్యంగా ట్వీటేస్తారు. ఆ తర్వాత ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్. మొదట్లో వర్మ ట్వీట్లపై చాలామంది గుంజుకునేవారు కానీ ఇప్పుడలాంటిదేమీ కనబడటం లేదు. ఎందుకో తెలియదు కానీ వర్మ మాత్రం తన స్టయిల్ మార్చుకోలేదు.
సెక్సీ బ్యూటీ యామీ గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా వర్మ ట్వీట్ చేశాడు. హే యామీ, పుట్టిన రోజు నాడు ఫెయిర్‌గా, లవ్లీగా ఉండాల్సిన నీవు ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ తన తీస్తున్న సర్కార్ 3 చిత్రంలోని స్టిల్ పోస్ట్ చేశాడు. ఆ చిత్రంలో ఆమె అలా ఉండక ఎలా ఉంటుంది. ఏదైతేనే వర్మ ట్వీట్స్ గురించి మీడియా రైట్ అప్స్ చేసేసింది. అదీ సంగతి.