బుల్లితెరపై మెరవనున్న రంభ.. జీ తెలుగు డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా?
అగ్రహీరోల నటించి అగ్రతార వెలుగొందిన రంభ.. వివాహానికి అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. అవకాశాలు లేకపోవడానికి తోడు భర్త నుంచి దూరమైన రంభ.. మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు సై అంటోంది. మొన్నటిదాకా
అగ్రహీరోల నటించి అగ్రతార వెలుగొందిన రంభ.. వివాహానికి అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. అవకాశాలు లేకపోవడానికి తోడు భర్త నుంచి దూరమైన రంభ.. మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు సై అంటోంది. మొన్నటిదాకా వెండితెరపై సందడి చేసిన రంభ.. తాజాగా జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న 'ఏబీసీడీ (ఎనీబడీ కెన్ డ్యాన్స్)' ప్రోగ్రామ్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోందని జీ టీవీ వర్గాలు వెల్లడించాయి.
హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో రంభ అందానికి, డ్యాన్సులకు కుర్రకారు వెర్రెత్తిపోయేవారు. అందుకే ఆమె డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వ్యవహరించనుంది. డ్యాన్స్‌లో రంభ స్టైల్ చాలా బాగుంటుందని అందుకే ఆమెను జడ్జిగా ప్రకటించినట్లు నిర్వాహకులు అంటున్నారు. రాబోయేరోజుల్లో వెండితెరపై రంభ రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అంటున్నారు.