Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

Advertiesment
The Waking of a Nation

దేవి

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:45 IST)
The Waking of a Nation
జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే దానికి వెనుకున్న అసలు రహస్యాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం దురాగాతాల్ని వెలికి తీసేలా ‘ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ సోనీ లివ్‌లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ మధ్వాని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాంతిలాల్ సాహ్ని అనే న్యాయ వ్యాధి పాత్రలో తరుక్ రైనా నటించారు. హంటర్ కమీషన్ చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఈ కాంతిలాల్ జాత్యహంకారం, చెరిపివేసి సత్యం కోసం పోరాడుతుంటాడు. మరి అసలు నిజాల్ని కాంతిలాల్ వెలికి తీశాడా? లేదా? ఈ ప్రయాణంలో స్నేహితులతో, అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు.
 
రామ్ మధ్వాని మాట్లాడుతూ..‘నాకు ఎల్లప్పుడూ వలసవాదం, జాత్యహంకారం, పక్షపాత ధోరణి వల్ల కలిగే సమస్యలను తెలుసుకుంటూ ఉంటాను.  సాంస్కృతిక, భాషా, సామాజిక, కళాత్మక వలసరాజ్యాల చుట్టూ ఉన్న ప్రశ్నలు నన్ను చాలాకాలంగా వెంటాడుతూనే ఉన్నాయి. నా తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఐడియా తట్టింది. ఇది మన గతానికి సంబంధించింది. బ్రిటీష్ సామ్రాజ్యంలో జరిగిన ఘోర ఉదంతం ఇది. ఇందులోని నిజనిజాల్ని తెలియజేయాలని అనుకున్నాను. అప్పుడే ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్ ఆలోచనకు ప్రాణం పోసినట్టు అయింది. ఇలాంటి ఓ గొప్ప చారిత్రాత్మకమైన ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన సోనీ లివ్ వారికి ధన్యవాదాలు. ఈ కోర్ట్ డ్రామా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
 
రామ్ మధ్వాని ఫిలింస్ బ్యానర్‌పై రామ్ మధ్వాని, అమిత మధ్వాని నిర్మించిన ఈ సిరీస్‌లో తారక్ రైనా, నికితా దత్తా, సాహిల్ మెహతా, భావషీల్ సింగ్, అలెక్స్ రీస్, పాల్ మెక్‌ఇవాన్‌లతో వంటి వారు నటించారు.  ఈ సిరీస్ కథను శంతను శ్రీవాస్తవ, శత్రుజీత్ నాథ్, రామ్ మధ్వానీ రచించిచారు. మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్