Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి టీమ్‌లో ఒక్కరికీ తల పొగరు లేదే.. ఎలా సాధ్యం. ఆశ్చర్యపోతున్న ఆ బ్యాడ్ బాయ్

ఒక సినిమాకోసం ఒక టీమ్ నాలుగేళ్లపాటు అకుంఠిత దీక్షతో శ్రమించడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ దేశ సినీరంగ చరిత్రపైనే చెదరని ముద్ర వేస్తూ రెండు భాగాల సినిమాలను పూర్తి చేసి విడుదల చేయడం. ఈ నాలుగేళ్ల కాలంలో ఎలాంటి వివాదానికి తావివ్వకుండా తమ మానాన తాము పని

Advertiesment
బాహుబలి టీమ్‌లో ఒక్కరికీ తల పొగరు లేదే.. ఎలా సాధ్యం. ఆశ్చర్యపోతున్న ఆ బ్యాడ్ బాయ్
హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (05:28 IST)
ఒక సినిమాకోసం ఒక టీమ్ నాలుగేళ్లపాటు అకుంఠిత దీక్షతో శ్రమించడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ దేశ సినీరంగ చరిత్రపైనే చెదరని ముద్ర వేస్తూ రెండు భాగాల సినిమాలను పూర్తి చేసి విడుదల చేయడం. ఈ నాలుగేళ్ల కాలంలో ఎలాంటి వివాదానికి తావివ్వకుండా తమ మానాన తాము పని చేసుకుపోతూ అనితర సాధ్యమైన చిత్రాన్ని దేశ ప్రజలకు, ప్రపంచానికి కూడా అందించడం అనేది ఒక్క బాహుబలి టీమ్‌కే సాధ్యమైంది. తాము ఎంత భారీ చిత్రాన్ని తీస్తున్నాం, ఎంత చరిత్ర సృష్టించబోతున్నాం అనే గర్వం అణుమాత్రం లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయిన బాహుబలి టీమ్‌కు చలనచిత్రరంగ చరిత్రలో తమదైన స్థానం దక్కింది.
 
నిజంగానే ఏ భాషా ప్రాంతంలో కూడా ఏ ప్రమోషన్‌లో కూడా బాహుబలి టీమ్ వివాదాల్లో చిక్కుకోలేదు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఫంక్షన్ లోనూ ప్రతి భాషా ప్రాంతంలోనూ అదే వినయం, అదే నమ్రత, అదే సాధుత్వం.. ఈ త్రిగుణాలతోనే వారు చలనచిత్ర ప్రేమికుల ముందు నిలబడ్డారు. అవే వారిని నేడు ఆకాశమంత ఎత్తులో నిలిపాయి.

ట్వీట్ల రారాజు రాంగోపాల్ వర్మకు ఇదే ఆశ్చర్యం. ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత కూడా చిత్ర దర్శకుడు రాజమౌళి నేటికీ కాళ్లు నేలమీదే పెట్టి నడవడం వర్మకు భయం కలిగిస్తోందట మరి. అందుకే ఆ దిగ్గజ దర్శకుడిని చూస్తూ టెన్షన్ తట్టుకోలేక వర్మ ఒక ట్వీట్ వదిలేశాడు.
 
విడుదలైన మూడు వారాల్లోనే రూ.1500 కోట్ల కలెక్షన్లు సాధించి భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది బాహుబలి-2. నాలుగో వారం కూడా హౌస్‌ఫుల్‌ నడుస్తోన్న ఈ సినిమా రూ.2వేల కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉందని సినీ పండితుల అంచనా.

ఇక మొదటి భాగం విడుదలైనప్పటి రెండో భాగం గ్లోబల్‌ హిట్‌ అయ్యేదాకా, అయిన తర్వాతకూడా దాదాపు బాహుబలిపై ఎక్కువ ట్వీట్లు చేసింది దర్శకుడు రాంగోపాల్‌ వర్మనే అంటే అతిశయోక్తికాదు. ఇటీవలే ఎస్‌ఎస్‌ రాజమౌళిని ట్యాగ్‌చేస్తూ వర్మ మరో ఆసక్తికర కామెంట్‌ చేశారు.
 
‘బాహుబలి కలెక్షన్ల కంటే కూడా రాజమౌళి వినమ్రత, విధేయతలే భయానకంగా అనిపిస్తాయి’ అని వర్మ వ్యాఖ్యానించారు. ‘కట్టప్ప’ విషయంలో కన్నడ సంఘాలను సముదాయించడం దగ్గర్నుంచి బాహుబలి-2ను అభినందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం,  పైసరీకారులను పట్టుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం తదితర చర్యలు.. ఇండియన్‌ మూవీ హిస్టరీలో ఆల్‌టైమ్‌ హిట్‌ కొట్టినతర్వాత కూడా రాజమౌళి డౌన్‌ టు ఎర్త్‌ అని రూడీచేస్తాయి.

గతంలో ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్‌లోనూ రాజమౌళి వినయపూరిత ప్రవర్తనపై వర్మ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందీ భాషపై పట్టుకోసం ప్రభాస్ పాట్లు.. బాలీవుడ్‌పై చూపే లక్ష్యం