Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమోషనల్ అండ్ రొమాన్స్ ''బ్యూటిఫుల్''-రాంగోపాల్ వర్మ

Advertiesment
ఎమోషనల్ అండ్ రొమాన్స్ ''బ్యూటిఫుల్''-రాంగోపాల్ వర్మ
, సోమవారం, 30 డిశెంబరు 2019 (19:10 IST)
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా `అగస్త్య మంజు` దర్శక‌త్వంలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్  నిర్మాతలుగా.. సహ నిర్మాతలుగా నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్ముస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `బ్యూటిఫుల్` (ట్రి బ్యూట్ టు రంగీలా) అనేది ఉప శీర్షిక. 
 
ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల చేస్తున్న సందర్భంగా శనివారం హైద్రాబాద్  లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
 రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ :- నేను రొమాంటిక్  ప్రేమకథా చిత్రం తీసి యుగాలై పోయింది. క్రిందటి జన్మలో రంగీల సినిమా తీసాను. ఇది ఆ సినిమాకు సీక్వల్‌గా ఉండవచ్చు. 
 
సాధారణంగా మగవాళ్ళు ఎదిగితే ఆడవాళ్లు వెనుక ఉంటారు.ఈ సినిమాలో అందుకు బిన్నంగా హీరోయిన్ ఎదుగుతుంటే హీరో వెనుక ఉంటాడు,అయితే హీరోయిన్ ఎదుగుదలను హీరో తట్టుకోగలడా లేదా? అన్నది ఈ చిత్రం కాన్సెప్ట్.. నా మదిలో మెదిలిన ఈ పాయింట్‌ను అగస్త్య మంజు కు చెపితే దీనిని అద్భుతమైన ప్రేమకథా చిత్రం గా మలిచాడు.. ఇందులో విలన్స్ ఉండరు.
 
సినిమా అంతా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.సంగీత భరితంగా ఉంటూనే రొమాన్స్ పరంగా కూడా ఆకట్టుకుంటూ కన్నీళ్లు తెప్పించే సన్నివేశాల తో మిలితమై ఉంటుంది..హీరోయిన్ నైనా ఈ పాత్ర కోసమేపుట్టిందా...అనిపించే  విదంగా ఉంటుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉత్సవ్‌‌లో 'సరిలేరు నీకెవ్వరు' డాంగ్ డాంగ్ సాంగ్ లాంచ్