Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖిల్ అప్పుడే నీకు పెళ్ళేంటి బాస్.. నీ ఏజ్‌కి పెళ్ళి అవసరమా? వర్మ ట్వీట్ అమల సైలెంట్

అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో పెను చర్చ సాగుతోంది. కాబోయే భార్యతో ఎయిర్ పోర్టులో జగడం వేసుకుని పెళ్ళి వద్దంటూ మొండికేసిన అఖిల్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించ

Advertiesment
అఖిల్ అప్పుడే నీకు పెళ్ళేంటి  బాస్.. నీ ఏజ్‌కి పెళ్ళి అవసరమా? వర్మ ట్వీట్ అమల సైలెంట్
, బుధవారం, 1 మార్చి 2017 (09:29 IST)
అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో పెను చర్చ సాగుతోంది. కాబోయే భార్యతో ఎయిర్ పోర్టులో జగడం వేసుకుని పెళ్ళి వద్దంటూ మొండికేసిన అఖిల్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. అఖిల్‌కి పెళ్ళి అనగానే అందరూ ఆహాఓహో అంటే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో అప్పుడే నీకు పెళ్ళేంటి బాస్.. నీ ఏజ్‌కి అప్పుడే పెళ్ళి అవసరమా.. అంటూ ట్వీట్ చేశాడు. 22 ఏళ్ళ అఖిల్‌-శ్రియా భూపాల్ పెళ్ళి రద్దైందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. వర్మ మాత్రం నేనెప్పుడో చెప్పా.. అప్పుడే అవసరమా నీకు అని ప్రశ్నించాడు.
 
మరోవైపు సినీన‌టుడు అక్కినేని నాగార్జున చిన్న‌ కుమారుడు అఖిల్‌కి, ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌కి ఇటలీలోని రోమ్‌లో పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అఖిల్, శ్రియల మధ్య విభేదాలు తలెత్తాయని, వారిద్దరూ బహిరంగంగానే వాదనకు దిగారని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. 
 
ఈ క్రమంలో అక్కినేని అఖిల్ తల్లి అమల హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెను మాట్లాడించేందుకు మీడియా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఇన్ ఆర్బిట్ మాల్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీతో పాటు మాదాపూర్‌లో ఓ సెలూన్, స్పాను అమ‌ల‌ ప్రారంభించారు. మీడియా నుంచి తనయుడి పెళ్లి ప్రస్తావన ప్ర‌శ్న వ‌స్తుంద‌ని ముందుగానే ఊహించిన అమ‌ల మీడియాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో... ఇప్పటికే ఆరడజను మంది...