చెర్రీ భార్య ఉపాసన మెగా ప్లాన్.. మామ చిరంజీవిని థ్రిల్ చేస్తుందట...
మెగాస్టార్ చిరంజీవికి ఆమె కోడలు ఉపాసన థ్రిల్ కలిగించే విధంగా వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాతగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రానికి సంబంధించి ఆడియో వేడుకను డిసెంబర్ 23న
మెగాస్టార్ చిరంజీవికి ఆమె కోడలు ఉపాసన థ్రిల్ కలిగించే విధంగా వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మాతగా రూపొందుతున్న 'ఖైదీ నెం.150' చిత్రానికి సంబంధించి ఆడియో వేడుకను డిసెంబర్ 23న చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి ఫ్యాన్స్‌తో సమావేశాలు కూడా జరిగాయి.
ఈ ఆడియో వేడుకకు తన సోదరుడు, హీరో పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు కూడా తెలియడంతో మరింత ఊపందుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో చిరంజీవి కుటుంబానికి సంబంధించిన హీరోలు అందరూ హాజరయ్యేలా ప్లాన్ చేశారు.
ఇప్పటికే గచ్చిబౌలిలోని స్టేడియంలో నిర్వహించేట్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ భార్య ఉపాసన.. ఈవెంట్ నిర్వహించడంలో మేటి అని తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ను చిరంజీవి కూడా చెప్పినట్లు తెలుస్తోంది.