చెన్నైలో టచ్ డౌన్ రామ్ చరణ్ దంపతులు గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు
, శనివారం, 13 ఏప్రియల్ 2024 (16:25 IST)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన పాప క్లింకార తో కలిసి చెన్నైలో వేల్స్ యూనివర్సిటీ కాన్వొకేషన్ వేడుకలో గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చారు.
నేడు అనగా శనివారం సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. యూనివర్శిటీ చాన్సెలర్ డాక్టర్ ఐసరి కె.గణేశ్ అధ్యక్షత వహించనున్నారు.
తర్వాతి కథనం