Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

Advertiesment
Peddi title

ఠాగూర్

, ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (13:21 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం "పెద్ది". బుచ్చిబాబు సాన దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. 
 
ఈ వీడియోలో చెర్రీ లుక్ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాసలో ఆయన చెప్పే డైలాగ్స్‌కు థియేటర్లలో ఈలలు, చప్పట్లతో మార్మోగాల్సిందే. "ఏదైన నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్లీ" అంటూ రామ్ చరణ్ చెప్పడం చూడొచ్చు. గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టి సిక్స్ షాట్ అద్భుతమని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వచ్చే యేడాది మార్చి 27వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కాగా, "గేమ్ ఛేంజర్" మూవీ తర్వాత చెర్రీ నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీపై ఇటు ఆయన ఫ్యాన్స్.. అటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!