Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాంచరణ్ చిత్రనిర్మాణ బ్యానర్ ఆవిష్కరణ.. పేరు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.. తొలి చిత్రం 'కత్తిలాంటోడు'

Advertiesment
Ram Charan's Konidela Production Company Logo Unveiled
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (12:39 IST)
మెగాస్టార్ తనయుడు ''చిరుత'' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రాంచరణ్ మొదటి చిత్రం హిట్‌తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జక్కన్న దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ''మగధీర''తో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అలతారమెత్తనున్నాడు. ఎప్పటినుండో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ చిత్రం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. 
 
తమిళంలో ఘనవిజయం సాధించిన ''కత్తి''ని తెలుగులో ''కత్తిలాంటోడు'' అనే టైటిల్‌తో సినిమా తీయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. చిరంజీవి 150వ సినిమాతో నిర్మాతగా మారనున్న రాంచరణ్ తన ప్రొడక్షన్ హౌస్ లోగోను రిలీజ్ చేశాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ఉన్న ఈ లోగోలో ఆరెంజ్ కలర్‌తో హనుమాన్ చిత్రాన్ని రూపొందించారు. 
 
కాగా, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ప్రారంభ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం గం. 1.30 గంటలకు జరుగనుంది. ఇందులో బంధు మిత్రులు మాత్రమే పాల్గొననున్నారు. ఇప్పటికే దర్శకుడు వివి వినాయక్ అంతర్వేదిలో లక్ష్మీనరసింహా స్వామి వద్ద చిరు 150వ చిత్రం స్క్రిప్ట్‌ని ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం పూజ కార్యక్రమాలను జరుపుకొని మే నెలలో మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంగీత సంచలనం దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని సమాకురుస్తుండగా, రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజాం ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'సరైనోడు'