రామ్ చరణ్‌ను పల్లెటూరి కుర్రోడిగా చూపించనున్న రామ్ చరణ్
'ధృవ' సినిమాలో పోలీసు అధికారిగా నటించి.. ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ పల్లెటూరి కుర్రోడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి తూర్పుగోదావరి బ్యాక్‌డ్రాప్‌గా త
'ధృవ' సినిమాలో పోలీసు అధికారిగా నటించి.. ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ పల్లెటూరి కుర్రోడిగా కన్పించబోతున్నాడు. ఈ చిత్రానికి తూర్పుగోదావరి బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్నారు. కథప్రకారం 1980-90 కాలంనాటి కథగా రాసుకున్నారు. పల్లెటూరి నేపథ్యంలో పలు చిత్రాలు చేసినా.. 'గోవిందుడు అందరివాడేలే'.. చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. సుకుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.
కాగా, చిత్రం కోసం గోదావరి జిల్లాల్లో షూటింగ్ పెడితే ఫ్యాన్స్ నుంచి అనూహ్యస్పందన వస్తోంది. అక్కడ కంట్రోల్ చేయడం కష్టమని.. ఔట్‌డోర్‌కు సంబంధించిన షాట్స్‌ను కొన్ని తీసి.. ఇంటికి సంబంధించిన వరకు సెట్‌వేసి తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఫిలింసిటీని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి రాశీఖన్నా కథానాయికగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ సాగనున్నందని తెలిసింది.