Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కైరా అద్వానీతో రామ్‌చరణ్ వ్యాయామం... వైరల్ అవుతున్న వీడియో...

''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో

Advertiesment
కైరా అద్వానీతో రామ్‌చరణ్ వ్యాయామం... వైరల్ అవుతున్న వీడియో...
, ఆదివారం, 20 మే 2018 (11:09 IST)
''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో చెర్రీ చెరువులో చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 
అలాగే, ఈ సినిమా హీరోయిన్‌ కైరా అద్వానీతో కలిసి రామ్‌ చరణ్‌ వ్యాయామం చేస్తోన్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ ఈ కొత్త సినిమాకి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.
 
బోయపాటి సినిమా కోసం సరికొత్త యాంగిల్‌లో కనిపించేందుకు చెర్రీ బాడీ డెవలప్‌ చేస్తుండగా, కైరా కూడా తానేం తక్కువ కాదంటూ ఎక్సర్‌సైజులు చేసింది. సరదాగా ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, వైరల్‌ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత దానయ్య చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా నువ్వే కోసం తమన్నా డ్యాన్స్(video)