ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేదికగా గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెర్రీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో వుంటున్నాడు.
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ నేపథ్యంలో ముంబై, షోలాపూర్, భీంవండి, అంథేరీ ప్రాంతాలలోని చరణ్ ఫ్యాన్స్ బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ను భారీస్థాయిలో పంచిపెట్టారు. 
	 
	చరణ్‌కి సంబంధించిన నినాదాలతో వాళ్లు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
	 
	ఇప్పటికే చెర్రీ ఫ్యాన్స్‌కు సంబంధించిన ఎన్జీవోలు, ది చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, RRR స్టార్ రక్తదాన శిబిరాలు, కంటి తనిఖీ శిబిరాలు, కోవిడ్ సహాయ శిబిరాలు, అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలకు మద్దతిస్తోంది.