Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నటజీవితం తొలిరోజుల్లో ఆకలితో అలమటించా: రకుల్ ప్రీత్ ఆవేదన

పంజాబీ అమ్మాయే అయినా తెలుగువారికంటే బాగా తెలుగు మాట్లాడే అద్భుత హీరోయిన్ ఆమె. ఇప్పుడంటే టాలీవుడ్, కొలివుడ్, బాలివుడ్ పరిశ్రమల్లో హీరోయిన్‌గా హల్ చల్ సృష్టిస్తున్న ఆ నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడంటే హీరోయిన్‌గా తనను అందరూ పువ్వల్లో పెట్టి చూసుకుంటున్

నటజీవితం తొలిరోజుల్లో ఆకలితో అలమటించా: రకుల్ ప్రీత్ ఆవేదన
హైదరాబాద్ , మంగళవారం, 27 జూన్ 2017 (06:28 IST)
పంజాబీ అమ్మాయే అయినా తెలుగువారికంటే బాగా తెలుగు మాట్లాడే అద్భుత హీరోయిన్ ఆమె. ఇప్పుడంటే టాలీవుడ్, కొలివుడ్, బాలివుడ్ పరిశ్రమల్లో హీరోయిన్‌గా హల్ చల్ సృష్టిస్తున్న ఆ నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడంటే హీరోయిన్‌గా తనను అందరూ పువ్వల్లో పెట్టి చూసుకుంటున్నారు కాని నటజీవితంలోకి వచ్చిన మొదట్లో తిండికి కూడా గతి లేని స్థితిలో ఆకలితో అలమటించానని, నిద్రలేమితో కష్టపడ్డానని చెబుతోంది రకుల్. 
 
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా స్పైడర్ చిత్రంలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ మొదట్లో అంతటి దుర్బర బాధను అనుభవించాను కాబట్టే సినీపరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అదే దోహదపడిందని చెబుతోంది. కోలివుడ్ లో కార్తీతో ధీరన్‌, అధికారం ఒండ్రు చిత్రంలోనూ నటిస్తున్న రకుల్ తన తొలి రోజులను గుర్తు చేసుకుంటూ సినిమాకు రాక ముందు చాలా కష్టపడ్డానని చెప్పింది. తినడానికి అన్నం కూడా లేక ఆకలి కడుపుతో, నిద్రలేమితో గడిపానని అంది. సినిమాలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అదే దోహదపడిందని నటి మరోసారి గుర్తు చేసుకుంది. 
 
 ప్రస్తుతం ఏ సమస్య ఎదురైనా టెన్షన్‌ పడకుండా తాను ప్రశాంతంగా ఆలోచించి సమస్యకు పరిష్కారం కనుగొనే పరిణితిని పొందానని చెప్పింది. సినిమా షూటింగులు ఒక్కోసారి అడవుల్లోనూ, కుగ్రామాలోనూ జరుగుతుంటాయని తెలిపింది. అలాంటప్పుడు స్టార్స్‌, ముఖ్యంగా హీరోయిన్లు తమకు మంచి వసతులు కావాలని మంకు పట్టు పట్టకూడదని ఆమె అంది. తనవరకూ కలిగిన దాంతో తినేసి, కాస్తంత చోటు దొరికితే అక్కడే విశ్రమించేస్తానని చెప్పింది.
 
ఆర్మీ అధికారి ఇంట్లో పుట్టి క్రమశిక్షణను ఉగ్గుపాలతో నేర్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ చిత్రసీమలో కెరీర్‌ నిర్మించుకోవటానికి కూడా అదే క్రమశిక్షణను, కష్టాలను ఓర్చుకునే తత్వాన్ని అలవర్చుకున్నది కాబట్టే తక్కువకాలంలోనే బహుభాషా చిత్ర కథానాయికగా కెరీర్ సృష్టించుకుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీసిన సినిమాలు ఎన్నిసార్లు తీస్తావు "హరీష్ శంకరా"???