Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రకుల్ కూడా అదే బాటలో.. పోలీస్ డ్రస్‌పై మక్కువ పెరిగిందట.. తమిళంలో ఛాన్స్

ఈ మధ్య కాలంలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ధరించిన యూనిఫాం ఒక్కసారిగా అందరినీ తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత రెజీనా వంటి వారు కొన్ని నిమిషాల పాటు పోలీసు యూనిఫాంలో కనిపించే పాత్రలను కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు తెలుగులో సూపర్ హీరోయిన్‌గా మారిన రకుల్

Advertiesment
rakul preet singh
హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (09:34 IST)
ఒకప్పుడు కథానాయకులు పోలీసు అధికారి పాత్రల్లో ధరిస్తే వాళ్ల కెరీర్‌కి అది ఎంతగానో దోహదపడేది. పోలీసు వేషం అంటేనే పవర్‌పుల్ పాత్ర అని రూఢి అయిపోయింది. 1990ల నుంచి హీరోయిన్లు పోలీసు ఆఫీసర్ పాత్రలు ధరించడం మొదలైంది. అంతకుముందు లక్ష్మి, మాధవి, శారద వంటి నటిలు పోలీసు పాత్రల్లో కనిపించినా పోలీసు యూనిఫాంకి ఎనలేని విలువ తీసుకువచ్చిన నటి విజయశాంతి. 90ల మొదట్లో ఆమె ప్రధానపాత్రలో నటించిన కర్తవ్యం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కిరణ్ బేడీ స్ఫూర్తిగా పోలీస్ అధికారిణి పాత్ర ధరించిన విజయశాంతి ఆ సినిమా నుంచే లేడీ అమితాబ్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఒక్కసారైనా పోలీసు పాత్ర వేయకపోతే కెరీర్‌కు అర్థం లేదనేంతగా హీరోయన్లు వరుసగా యూనిఫాంలో కనిపించసాగారు
 
ప్రస్తుతం మన యువ నటిలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లున్నారు. ఈ మధ్య కాలంలో బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ధరించిన యూనిఫాం ఒక్కసారిగా అందరినీ తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత రెజీనా వంటి వారు కొన్ని నిమిషాల పాటు పోలీసు యూనిఫాంలో కనిపించే పాత్రలను కూడా ఇష్టపడ్డారు. ఇప్పుడు తెలుగులో సూపర్ హీరోయిన్‌గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అదీ కూడా తమిళంలో కావడం విశేషం. 
 
తొలుత కోలీవుడ్‌కే ఎంట్రీ ఇచ్చిన ఈ రకుల్ రెండు మూడు చిత్రాల్లో నటించినా ఆదరణ లభించలేదు. దీంతో పొరుగు భాష తెలుగులో దృష్టి సారించి అక్కడ సక్సెస్‌ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నా, కోలీవుడ్‌లో గెలవలేక పోయాననే చింత వెంటాడుతూనే ఉందట. తాజాగా కోలీవుడ్‌లోనూ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు రావడం మొదలెట్టాయి. మధ్యలో విశాల్‌కు జంటగా మిష్కిన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా దాన్ని వదులుకుంది. 
 
ఆ చిత్రం పోయిందన్న బాధను మరచిపోయేలా కార్తీతో ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో అవకాశం వరించింది. చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ పోలీస్‌ అధికారిగా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా పోలీస్‌ పాత్రలో కనిపించనుందట. కాగా ఈ రెండు చిత్రాలతోనే కోలీవుడ్‌లో తన భవిష్యత్‌ ఆధారపడి ఉందని రకుల్‌ ప్రీతిసింగ్‌ భావిస్తోందట.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఉయ్యాలవాడ'లో రెండో హీరోయిన్‌ పేరు ఖరారు... రెమ్యునరేషన్‌గా రూ.4 కోట్లు?