Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్ని వేడుకలూ అయిపోయాయ్.. ఇక పెళ్లి వేడుకలు మాత్రమే మిగిలాయ్.. రకుల్ ఇలా అనేసిందేమిటి?

తెలుగు చిత్రసీమలోకి తూటాలా దూసుకొచ్చిన లావణ్య రాశి రకుల్ ప్రీత్ సింగ్ తన జీవితంలో పెళ్లి వేడుక తప్ప అన్ని వేడుకలూ అయిపోయాయ్ అనేసి షాక్ తెప్పించింది. ఇప్పుడిప్పుడే కేరీర్‌లో ఉచ్ఛ దిశను అనుభవిస్తున్న రకుల్ వరుసగా అగ్రహీరోల సరసన నటిస్తూ నిర్మాతలకు అనుకూ

Advertiesment
Rakul preeth singh
హైదరాబాద్ , మంగళవారం, 23 మే 2017 (04:34 IST)
తెలుగు చిత్రసీమలోకి తూటాలా దూసుకొచ్చిన లావణ్య రాశి రకుల్ ప్రీత్ సింగ్ తన జీవితంలో పెళ్లి వేడుక తప్ప అన్ని వేడుకలూ అయిపోయాయ్ అనేసి షాక్ తెప్పించింది. ఇప్పుడిప్పుడే కేరీర్‌లో ఉచ్ఛ దిశను అనుభవిస్తున్న రకుల్ వరుసగా అగ్రహీరోల సరసన నటిస్తూ నిర్మాతలకు అనుకూలమైన హీరోయిన్‌గా చక్కటి గుర్తింపు పొందింది. మరి ఇంత చిన్న వయసులోనే పెళ్లి మాట ప్రస్తావిస్తూందే.. ఏమిటీ ట్విస్టు అంటున్నారా.. అక్కడే ఉంది మరి అసలు విషయం.
 
 
నాగచైతన్య హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. ఈ సినిమా గురించి సోమవారం హైదరాబాద్‌లో రకుల్‌ విలేకరులతో మాట్లాడిన సందర్భంగా పెళ్లి గురించి ప్రస్తావించారు. మా ఫ్యామిలీలో దాదాపు అన్ని వేడుకలూ అయిపోయాయి. ఇక ఉంటే నా పెళ్లే ఉంటుంది. అది కూడా ఇప్పుడప్పుడే లేదు. నేను కూడా ఓ రాజకుమారుడు వస్తాడని ఎదురుచూస్తుంటాను. కానీ ఈ కాలంలో రాజ్యాలు, రాజులు లేరుగా..మరి రాజకుమారుడు ఎలా పుడతాడు. ప్రేమ పెళ్లంటే నాకు ఇష్టమే... కానీ జీవితంలో ప్రేమ అనేది జరగాలిగా. అనేసింది రకుల్. 
 
ఫక్తు కమర్షియల్‌ చిత్రంలో హీరోయిన్‌కు పెద్దగా స్కోప్‌ అన్ని సందర్భాల్లోనూఉండకపోవచ్చు. కానీ ప్రేమకథా చిత్రాల్లో ఉంటుంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘నిన్నే పెళ్లాడతా’ తరహా చిత్రమిది. కుటుంబవిలువలకు పెద్ద పీట వేశాం. చూసిన వారికి పండుగలా ఉంటుంది. నాక్కూడా వ్యక్తిగతంగా వేడుకలంటే ఇష్టమే. కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచించేటంత సమయం లేదు. మా ఫ్యామిలీలో దాదాపు అన్ని వేడుకలూ అయిపోయాయి. ఇక ఉంటే నా పెళ్లే ఉంటుంది. అది కూడా ఇప్పుడప్పుడే లేదు అంటూ అన్యాపదేశంగా పెళ్లి గురించి ప్రస్తావించింది రకుల్.
 
టాలీవుడ్‌లో మోస్ట్ లక్కియస్ట్ గర్ల్‌గా పేరు కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్ మరి కొన్నేళ్లు దక్షిణాది సినీ ప్రేక్షకులను తన అందంతో, అభినయంతో అలరిస్తుందనే ఆశిద్దాం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరమా.. మరి అబ్బాయిలు విషం కదా. ప్రాణాలే తీస్తున్నారు.. రకుల్ ఫిట్టింగ్ రిప్లై