Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అది చేసిన తరువాతే రకుల్‌కు అవకాశం... ఇప్పుడేమో అది నడుపుతోంది... కుర్రాళ్లు క్యూ?

రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఉన్న హీరోయిన్. అందాలు ఆరబోయడంలో రకుల్ ప్రీత్ సింగ్ తరువాతే ఎవరైనా అంటుంటారు తెలుగు ప్రేక్షకులు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఫారెన్ అమ్మాయిగా రకుల్ చేసిన అభినయంతో తెలుగు ప్రేక్షకులు

Advertiesment
rakul preet singh
, సోమవారం, 29 మే 2017 (13:03 IST)
రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా ఉన్న హీరోయిన్. అందాలు ఆరబోయడంలో రకుల్ ప్రీత్ సింగ్ తరువాతే ఎవరైనా అంటుంటారు తెలుగు ప్రేక్షకులు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఫారెన్ అమ్మాయిగా రకుల్ చేసిన అభినయంతో తెలుగు ప్రేక్షకులు ఆమెకు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత సైజ్ తగ్గించి రారండోయ్ వేడుక చూద్దామంటూ నాగ చైతన్యతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. 
 
అసలు రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ పుట్టింది. ఎక్కడ పెరిగింది. అసలెలా సినిమాల్లోకి వచ్చింది. ఎవరికి తెలియదు. రకుల్ ప్రీత్ సింగ్ మొదటగా చిన్నచిన్న యాడ్స్‌లో నటించేది. ఆమె పుట్టింది ఢిల్లీలో. అక్టోబర్ 10, 1990సంవత్సరంలో ఢిల్లీలో పుట్టి పెరిగింది. లెక్కల్లో రకుల్ ప్రీత్ సింగ్ దిట్ట. చిన్నప్పుడే సెంట్రల్ స్కూల్లో చదివిన రకుల్ టకాటకాక లెక్కలను చెప్పేస్తుంది. 
 
చిన్నచిన్న యాడ్స్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు చిత్తూరు జిల్లాలో ఒక యాడ్ చేసిన తరువాత ఆమె దశ, దిశ మారిపోయింది. అదే అపూర్వ బట్టల షాపు యాడ్. ఆమె 2010 సంవత్సరంలో అపూర్వ యాడ్‌లో నటించిన తరువాత ఆమెను చూసిన ఒక తెలుగు డైరెక్టర్ తెలుగు సినిమాలో అవకాశం ఇచ్చారు. సినిమాలో నటిస్తూనే 2011లో ఫెమీనా అవార్డులో అందగత్తెగా అవార్డు అందుకుంది ఢిల్లీ భామ. ఆ తరువాత తెలుగు సినిమాల్లో అడపాదడపా నటిస్తూ వచ్చింది. 
 
ఒక్క తెలుగులోనే కాదు 2009లో కన్నడ, 2014లో బాలీవుడ్ ఇలా వివిధ భాషల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చింది. సాధారణ మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించిన రకుల్ ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్లు అది చేస్తేనే అవకాశం వస్తుందని చాలామంది చెబుతుంటారు. 
 
కొంతమందైతే బహిరంగంగానే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటారు. కానీ రకుల్ మాత్రం కష్టపడి పైకొచ్చిందంటున్నారు ఆమె తల్లిదండ్రులు. హైదరాబాద్‌లోనే స్థిరపడ్డ ఈ ఢిల్లీ భామ హైదరాబాద్‌లో సొంతంగా జిమ్ కూడా నడుపుతోందట. గచ్చిబౌలిలో ఎఫ్-45 పేరుతో సొంతంగా జిమ్‌ను నడుపుతోంది రకుల్. రకుల్ ఈ జిమ్‌ను నడుపుతోందని తెలిసిన హైదరాబాద్ యువకులు క్యూ కట్టి మరీ జిమ్‌కు వెళుతున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడల్ గానమ్ నాయర్ మిస్సింగ్ మిస్టరీ.. ఫ్రెండ్ ఇంటికని ఎక్కడికెళ్లింది?