జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో ఆరు నెలల క్రితం తగిలిన గాయం నుంచి ఇంకా కోలుకోలేదన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. గత యేడాది అక్టోబరు నెలలో జిమ్‌లో ఆమె గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయంపై మాట్లాడుతూ, ఈ గాయం తనకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిందన్నారు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న రకల్ తన ఆరోగ్యంపై స్పందించారు. "జిమ్‌లో గాయం నాకో ఎదురుదెబ్బ. ఇప్పటికీ సరైన స్థితిలోకి రాలేదు. అప్పటికంటే కాస్త మెరుగు అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నాను. అన్నీ మనం అనుకున్నట్టు జరిగుతాయని అనుకున్నా ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది.
గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశాను. చికిత్స కోసం తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికి దాని తీవ్ర ఎక్కువైపోయింది. గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమైంద. ధైర్యంగా దాన్ని నుంచి కోలుకుంటున్నాను. నా వర్క్‌లో బిజీ అవుతున్నాను" అని చెప్పారు.
వ్యాయామం చేస్తూ 80 కేజీల బరువు ఎత్తే క్రమంలో రకుల్ గాయపడిన విషయం తెల్సిందే. దీనిపై ఎన్నో సందర్భాల్లో ఆమె మాట్లాడారు. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవడం ఎంతో అవసరమని అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.