Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌జ‌నీకాంత్ 'పేట' తెలుగు రైట్స్‌ని ఎన్ని కోట్ల‌కు కొన్నారో తెలుసా..?

Advertiesment
ర‌జ‌నీకాంత్ 'పేట' తెలుగు రైట్స్‌ని ఎన్ని కోట్ల‌కు కొన్నారో తెలుసా..?
, శనివారం, 29 డిశెంబరు 2018 (12:39 IST)
ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని పేట తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈయన గతంలో విజయ్ సర్కార్.. మణిరత్నం నవాబ్ సినిమా హక్కులను తెలుగులో తీసుకున్నారు. ఇప్పుడు పేట హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారీ పోటీ మధ్య ఈ డీల్ సొంతం చేసుకున్నారు అశోక్. 
 
ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు ఈ నిర్మాత‌. తెలుగులో ఈ చిత్రాన్ని భారీగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత అశోక్. పేట సినిమా ర‌జినీకాంత్, కార్తిక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో వ‌స్తుంది. సూపర్ స్టార్‌కు తెలుగులో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాకు హెల్ప్ కానుంది.
 
రజ‌నీ ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు. ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఇందులో కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పేట సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తుండగా.. సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. జనవరి 10న విడుదల కానుంది పేట.
 
సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: కార్తిక్ సుబ్బ‌రాజ్, నిర్మాత‌: వ‌ల్ల‌భ‌నేని అశోక్, నిర్మాణ సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్, డిఓపి: ఎస్ తిర‌ణ‌వుక్క‌రుసు, సంగీతం: అనిరుధ్ ర‌విచంద‌ర్, ఎడిట‌ర్: వివేక్ హ‌ర్ష‌న్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సురేష్ సెల్వ‌రాజ‌న్, యాక్ష‌న్ డైరెక్ట‌ర్: పీట‌ర్ హెయిన్, క్యాస్ట్యూమ్ డిజైన‌ర్:  నిహారిక భాసిన్ ఖాన్, ప్ర‌వీణ్ రాజా, కొరియోగ్ర‌ఫీ: ష‌రీఫ్, బాబా భాస్క‌ర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..?