Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోబో 2.0 ఫస్ట్ లుక్: రజనీపై అక్షయ్ ప్రశంసల జల్లు.. మేకప్ వేస్తుంటే సినిమాలు చూసేవాడిని?

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో-2 (2.0) రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌న

Advertiesment
Rajinikanth
, సోమవారం, 21 నవంబరు 2016 (14:04 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో-2 (2.0) రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆకాశానికెత్తేశాడు. ఆ స్టైల్ సూపర్ అంటూ కితాబిచ్చేశాడు. కోటును స్టైల్‌గా సరిచేసుకోవడంతో పాటు, సిగరెట్ కాల్చడం వంటివి ఆయనకే సాధ్యమంటూ కొనియాడాడు. గతంలో తన సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కానప్పుడు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రజనీ డబ్బులు వాపస్‌ ఇచ్చారని తెలుసుకొని తాను అబ్బురపడ్డానని, అదీ రజనీ గొప్పతనమని చెప్పుకొచ్చారు. 
 
బాబా సినిమా పెద్దగా ఆడకపోయేసరికి డిస్ట్రిబ్యూటర్లను పిలిపించి మరీ డబ్బులిచ్చారని.. రజనీకాంత్ నిజమైన సూపర్ స్టార్ అని చెప్పేందుకు ఇంతకంటే.. గొప్ప ఉదాహరణ ఏం కావాలని అక్షయ్ అన్నారు. తన 25 ఏళ్ల కెరీర్‌లో తాను ఎప్పుడూ పెద్దగా మేకప్‌ వేసుకోలేదని, కానీ రోబో-2 సినిమాలో విలన్‌ పాత్ర కోసం మేకప్‌ వేసుకోవడానికి మూడు గంటలు, మేకప్‌ తీయడానికి ఒక గంట తనకు పట్టేదని చెప్పారు. తనకు మేకప్‌ వేస్తున్నంతసేపు తాను టీవీలో సినిమాలు చూస్తుండేవాడినని అక్షయ్ వెల్లడించారు. 
 
ఈ  సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. శంకర్‌తో పనిచేయడం చాలా కష్టమని చెప్పారు. ఆయన పనితీరు పక్కాగా ఉంటుందని.. 3డీ టెక్నాలజీతో పిక్చర్‌ చేసిన విధానం సూపర్ అంటూ వ్యాఖ్యానించారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ కాదని.. హీరో అన్నారు.

webdunia


webdunia




 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్‌ ఇంత హాయిగా చేయవచ్చా... నిత్యా మీనన్ కామెంట్