Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా భార్య అర్ధాంగి కాదు... సర్వాంగి అంటూ ఆకాశానికెత్తిన రాజమౌళి.. సిగ్గుపడిపోయిన రమ

బాహుబలి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించినప్పుడు తనలో గర్వాన్ని మొట్టికాయ వేసి నేలకు దించి నా ప్యామిలీ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమతూకంలో నడుపుతున్న ఒకే ఒక వ్యక్తి నా భార్య రమ అంటూ రాజమౌళి చెప్పినప్పుడు స్టేజ్ కింద జనం హర్షధ్వానాలు చేశారు.

నా భార్య అర్ధాంగి కాదు... సర్వాంగి అంటూ ఆకాశానికెత్తిన రాజమౌళి.. సిగ్గుపడిపోయిన రమ
హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (05:36 IST)
ఫ్యామిలీ ఫ్యామిలీయే ఉప్మా తిని బతికేస్తోందా నాన్నా అంటూ పోకిరి సినిమాలో మహేష్ బాబు దశాబ్ద కాలంపాటు జనం నోళ్లలో నానే పంచ్ డైలాగ్ వేశాడు. ఆది ఇంకా జనం జ్ఞాపకాల్లో నానుతూనే ఉంది. ఫ్యామిలీ ఫ్యామిలీ సినీ రంగానికి అంకితమైపోయిన చరిత్ర రాజమౌళి కుటుంబానికి మాత్రమే దక్కుతుంది. ఆయన కుటుంబంలో సినీరంగంలోకి దిగినవారు ఎందరు అనే ప్రశ్నకు బదులుగా దిగని వారు ఎందరు అని ప్రశ్నిస్తే సమాధానం సులభంగా వస్తుంది. ఎవరూ లేదని.

 
రాజమౌళి తీసిన పది సినిమాల్లో చాలావాటికి కాస్ట్యూమ్ డిజైనర్ ఆమె. రమా రాజమౌళి. రమ, శ్రీవల్లి, ప్రశాంతి తెరవెనుక పనిచేయకుంటే బాహుబలి సినిమానే లేదనేంత రేంజిలో ఆ ముగ్గురిని రాజమౌళి టీమ్ పొగిడేస్తుంటుంది. రాజమౌళి కూడా దాంట్లో భాగమే. రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించినప్పుడు తనలో గర్వాన్ని మొట్టికాయ వేసి నేలకు దించి నా ప్యామిలీ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమతూకంలో నడుపుతున్న ఒకే ఒక వ్యక్తి నా భార్య రమ అంటూ రాజమౌళి చెప్పినప్పుడు స్టేజ్ కింద జనం హర్షధ్వానాలు చేశారు. 
 
తనలోని కోపాన్ని, గర్వాన్ని, పొగరును బయటకు చెప్పుకోవడం రాజమౌళి గొప్పతనం అయితే అంతటి పెద్ద దర్శకుడిని జీవితంలోనూ, వృత్తిలోనూ సరిచేస్తూ సరైన దారిలో పయనింపజేస్తున్న రమ.. రాజమౌళికి అర్ధాంగి ఎందుకవుతుంది. సర్వాంగి అనే పదమే ఆమెకు సరైన పదం కాబోలు. ముఖ్యంగా.. "నేనూ మనిషినే కాబట్టి హిట్స్‌ వచ్చినప్పుడు పొగరు, గర్వం పెరుగుతాయి. అలాంటప్పుడు ఓ మొట్టికాయ వేసి నన్ను నేలకు దించుతూ, ఫ్యామిలీ లైఫ్‌ని, ప్రొఫెషనల్‌ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేయాలో నేర్పిస్తున్న నా భార్యకి థ్యాంక్స్‌" అనే పంచ్ డైలాగ్ వేసిన  రాజమౌళికి కుటుంబంలో భార్య ప్రాధాన్యం ఎంతటిదే తేల్చి చెప్పినందుకు సెల్యూట్ చేయాలి.
 
అందుకే ఏం ఫ్యామిలీరా నాయనా ఇది అనుకోవడానికి ఇదీరా ఫ్యామిలీ అంటే అనుకోవడానికి మధ్య వారగా మనం రాజమౌళి దంపతులను  చెప్పవచ్చు.
 
అయితే.. "మా ఆవిడ (రమా రాజమౌళి) కాస్ట్యూమ్స్‌ గురించి చెప్పడం లేదు. ఆవిడ గురించి ఏవీ (ఆడియో విజువల్‌) ప్లే చేశాం. మరీ ఎక్కువ పొగిడేస్తే మాట వినదు. స్టైల్‌గా ఈ మాట అనేసినా మళ్లీ భయం వేస్తోంది" అంటూ రాజమౌళి జోకీగా చెప్పిన మాటలకు ఈవెంట్‌కు వచ్చిన జనం పకపక నవ్వేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె అంటే అందరికీ ఎందుకంత ఇది.. మాయ చేసే నయని కాదే..!