Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కట్టప్ప చేసిన కామెంటుకు బాహుబలిపై కోపించకండి.. మాకు మీ ప్రేమ కావాలి: వేడుకున్న రాజమౌళి

తాము ఎంతో వ్యయప్రయాసలతో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ‘బాహుబలి 2’ సినిమా దయచేసి అడ్డుకోవద్దంటూ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కన్నడ భాషలో విజ్ఞప్తి చేస్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

కట్టప్ప చేసిన కామెంటుకు బాహుబలిపై కోపించకండి.. మాకు మీ ప్రేమ కావాలి: వేడుకున్న రాజమౌళి
హైదరాబాద్ , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (01:33 IST)
తాము ఎంతో వ్యయప్రయాసలతో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ‘బాహుబలి 2’ సినిమా దయచేసి అడ్డుకోవద్దంటూ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కన్నడ భాషలో విజ్ఞప్తి చేస్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కావేరి జలాల వివాదంపై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, దాన్ని పట్టుకుని ‘బాహుబలి 2’ సినిమాను అడ్డుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని వీడియోలో వివరించారు. దయచేసి సినిమాను అడ్డుకోవద్దని కన్నడ సంఘాలను కోరారు.
 
కన్నడ భాషలో రాజమౌళి చేసిన వీడియో ట్వీట్ పాఠం ఇదే..
 
''అందరికీ నమస్కారం. నాకు కన్నడ సరిగ్గా రాదు. తప్పులేమన్నా ఉంటే క్షమించవలసిందిగా ప్రార్థన. సత్యరాజ్‌గారికి సంబంధించిన వివాదం గురించి నేను, మా నిర్మాతలు మీకు ఒక స్పష్టత ఇవ్వదలిచాము. కొద్ది సంవత్సరాల క్రితం వారు చేసిన వ్యాఖ్యలు మీలో చాలా మందికి మనోవేదన కలిగించాయి. కానీ ఆ వ్యాఖ్యలకు, మాకు ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం సత్యరాజ్‌గారి వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఈ కామెంట్స్‌ చేసి తొమ్మిది సంవత్సరాలు కావొస్తోంది. ఆ తర్వాత ఆయన నటించి, నిర్మించిన ఎన్నో సినిమాలు కర్ణాటకలో విడుదల అయ్యాయి. బాహుబలి-1 కూడా విడుదలైంది. వాటన్నింటినీ ఎలా ఆదరించారో బాహుబలి-2ని కూడా ఆదరించాలని కోరుతున్నాను....
 
...సత్యరాజ్‌ గారు ఈ సినిమాకి దర్శకులు కారు, నిర్మాత కారు. ఈ సినిమాలో నటించిన నటుల్లో ఒకరు. ఈ సినిమా విడుదల ఆపేస్తే ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. ఆయన ఒక్కరు చేసిన కామెంట్ వల్ల ఇంత మందిపై ప్రభావం చూపుతుంది. వారొక్కరి మీద ఉన్న కోపాన్ని బాహుబలి సినిమాపై చూపడం సరైనది కాదని తెలియజేస్తున్నాం. ఈ విషయం గురించి సత్యరాజ్‌ గారికి ఫోన్‌ చేసి పరిస్థితి మాట్లాడాను. అంతకుమించి ఏమీ చేయడానికి మాకు శక్తిలేదు. మాకు ఏ విధంగానూ సంబంధంలేని ఈ వ్యవహారంలో మమ్మల్ని లాగొద్దని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాం. మీ ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుతూ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
 
కాగా, కావేరి జలవివాదం సమయంలో కన్నడిగులను అవమానపరిచే విధంగా సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కన్నడ సంఘాల నేతలు ఇకపై సత్యరాజ్ నటించిన ఏ సినిమాను కర్ణాటకలో విడుదలకాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇప్పుడు ‘బాహుబలి 2’ను అడ్డుకుంటున్నారు. గురువారం బెంగళూరులో బాహుబలి పోస్టర్లను ఆందోళనకారులు తగలబెట్టారు. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగారు. స్పష్టమైన కన్నడ భాషలో కన్నడ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే నందమూరి మోక్షజ్ఞకు నటించాలన్న ఆసక్తి లేదట...