Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందుకే నందమూరి మోక్షజ్ఞకు నటించాలన్న ఆసక్తి లేదట...

నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో తెరంగేట్రం చేస్తాడన్న అభిమానులకు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మోక్షజ్ఞకు సినిమాల్లో నటించడంపై ఆసక్తి లేదంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు పోతున్నాయి. కాగా మోక్షజ్ఞ ఇటీవలే బాలయ్య నటించిన గౌతమిపుత్

అందుకే నందమూరి మోక్షజ్ఞకు నటించాలన్న ఆసక్తి లేదట...
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (21:41 IST)
నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో తెరంగేట్రం చేస్తాడన్న అభిమానులకు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మోక్షజ్ఞకు సినిమాల్లో నటించడంపై ఆసక్తి లేదంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు పోతున్నాయి. కాగా మోక్షజ్ఞ ఇటీవలే బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 
 
మోక్షజ్ఞ హీరోగా ఓ రొమాంటిక్ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తారన్న వార్తలు వచ్చాయి కూడా. ఐతే ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. ఇంతలోనే అసలు మోక్షజ్ఞకు నటించడంపై ఆసక్తి లేదన్న వార్తలు బయటకు వస్తున్నాయి. వ్యాపారం చేసే ఆలోచనలో మోక్షజ్ఞ వున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తేలాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోల ముందే (ఆరుబయట) దుస్తులు మార్చుకొనేవాళ్లం... సీనియర్ నటి...