Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుమ పెళ్ళి ప్రశ్నకు రాజ్ తరుణ్ ఏమన్నాడో తెలుసా? మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే?

యాంకర్ సుమ యాంకరింగ్‌లో రికార్డులను బద్ధలు కొట్టింది. టీవీ షోల నుంచి భారీ ప్రోగ్రామ్‌ల వరకు తన వాయిస్‌తో అందరికీ ఆకట్టుకున్న సుమ.. హీరోయిన్లకు ధీటుగా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. తన వాక్చాతుర్యతతో

సుమ పెళ్ళి ప్రశ్నకు రాజ్ తరుణ్ ఏమన్నాడో తెలుసా? మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే?
, బుధవారం, 21 డిశెంబరు 2016 (13:13 IST)
యాంకర్ సుమ యాంకరింగ్‌లో రికార్డులను బద్ధలు కొట్టింది. టీవీ షోల నుంచి భారీ ప్రోగ్రామ్‌ల వరకు తన వాయిస్‌తో అందరికీ ఆకట్టుకున్న సుమ.. హీరోయిన్లకు ధీటుగా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. తన వాక్చాతుర్యతతో బుల్లితెరపై కాకుండా సినిమా ఆడియో ఫంక్షన్లలోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్న సుమకు యంగ్ హీరో రాజ్ తరుణ్ షాక్ ఇచ్చాడు. 
 
ఇటీవల జరిగిన 'శతమానం భవతి' ఆడియో ఫంక్షన్‌లో సుమకు రాజ్ తరుణ్ షాకిచ్చాడు. ఈ సినిమా పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్‌ ప్రకారం తెరకెక్కడంతో వచ్చిన అతిథులందరినీ 'మీ పెళ్లెప్పుడు' అని అడిగి ప్రశ్నలు రాబట్టింది సుమ. యువ హీరో రాజ్‌తరుణ్‌ వేదికపైకి రాగానే.. 'నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా' అని ప్రశ్నించింది. దీనికి రాజ్‌తరుణ్‌.. 'ఇప్పటికీ మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. ఆ ఆలోచన ఉండేది.
 
ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని సమాధానమిచ్చాడు. రాజ్ తరుణ్ నుంచి ఇలాంటి సమాధానం రావడంతో సుమతో పాటు అక్కడికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. వెంటనే తేరుకున్న సుమ రాజ్‌తరుణ్‌కు 'హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌' అని చెప్పి పంపించేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్‌డస్ట్ షోలో తమన్నా హాటెస్ట్ ఫోజులు...