17న విడుదలకు సిద్ధమవుతున్న రాజ్‌తరుణ్ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'
రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం
రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో 'ఈడోరకం-ఆడోరకం' సినిమా తర్వాత ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.
ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ కుక్కలను కిడ్నాప్ చేసే యువకుడిగా పాత్రలో కనపడనున్నారు. డబ్బు కోసం కుక్కలను కిడ్నాప్ చేయడమే కాకుండా, ప్రేమ కోసం రాజ్‌తరుణ్ ఏంచేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుందని నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేశారు.
'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి హిస్టారికల్ సినిమాకు సంభాషణలు రాసిన రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు ఫన్నీ డైలాగ్స్‌ను అందించారు. రాజ్‌తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో నటిస్తుండటం గమనార్హం. అనూప్ రూబెన్స్ ఈసినిమాకు సంగీత బాణీలు సమకూర్చారు.