Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్ తరుణ్ స్నేహితుడు ప్రైవేట్ భాగాలను గాయపరిచాడు-లావణ్య

Advertiesment
Raj Tarun's Ex-Lover Lavanya

వరుణ్

, ఆదివారం, 4 ఆగస్టు 2024 (20:44 IST)
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్య మధ్య కొనసాగుతున్న వైరం రోజు రోజుకీ పెరుగుతోంది. రాజ్ తరుణ్ స్నేహితుడు, రేడియో జాకీ అయిన శేఖర్ బాషా యూట్యూబ్ ఇంటర్వ్యూలో లావణ్యపై దాడికి పాల్పడ్డారు. 
 
కడుపులో గాయం అయిన లావణ్య, దాడిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శేఖర్ బాషా తన కడుపు, వీపుపై తన్నాడని, తన ప్రైవేట్ భాగాలకు గాయాలు చేశాడని లావణ్య ఆరోపించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
బాషాతో తనకు ప్రాణహాని ఉందని, తన ఇంటిపై రాళ్లు రువ్వుతున్నాడని లావణ్య పేర్కొంది. గతంలో లావణ్య రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి గర్భం దాల్చినట్లు ఆపై అబార్షన్ చేయమని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది. 
 
రాజ్ తరుణ్ మరో నటి కోసం తనను విడిచిపెట్టాడని, తన పరువు తీసేందుకు డ్రగ్స్ సంబంధిత సమస్యలలో తనను ఇరికించాడని లావణ్య ఆరోపించింది. కానీ రాజ్ తరుణ్ ఈ వాదనలను ఖండించారు. వారు చాలా సంవత్సరాలు కలిసి జీవించారని మాత్రమే అంగీకరించారు. లావణ్య డ్రగ్స్ సమస్యల కారణంగా తమ సంబంధం ముగిసిపోయిందని, ఆమె ఇప్పుడు వేరొకరితో సంబంధం పెట్టుకుందని రాజ్ తరుణ్ అభిప్రాయపడ్డాడు.
 
రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని గత నెలలో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా తండేల్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్