Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Advertiesment
Rahul, Harinya, Cricketer Yuzvendra Chahal

దేవీ

, మంగళవారం, 25 నవంబరు 2025 (12:07 IST)
Rahul, Harinya, Cricketer Yuzvendra Chahal
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్యకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీ ఈయన వివాహపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.
 
రాహుల్, హరిణ్య స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్ళికి రావాలి అంటూ ఆహ్వానించిన సంగతే తెలిసిందే. మరికొద్ది రోజులలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా సంగీత్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ఈ సంగీత్ వేడుకలో భాగంగా రాహుల్ తనకు కాబోయే భార్య హరిణ్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. 
 
హరిణ్యకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అంటే విపరీతమైన అభిమానమట. ఈ క్రమంలోనే రాహుల్ తన సంగీత్ వేడుకకు చాహల్‌ను ఆహ్వానించడంతో హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. ప్రస్తుతం చాహల్‌తో కలిసి దిగిన ఫోటోలను హరిణ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. తనకు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినందుకు రాహుల్‌కు హిరణ్య ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

రాహుల్ తన కాబోయే భార్యకు ఎప్పటికప్పుడు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తూ సంతోషపెడుతున్నారు . నిశ్చితార్థ సమయంలో కూడా ఈయన హరిణ్య కోసం ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్‌ను ఇన్వైట్ చేసి ఆమెను మరింత సంతోష పరిచారు. వీరి పెళ్లికి రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సంగీత్, హల్దీ వంటి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !