Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ దక్షిణాది హీరో.. నా కాలిని అలా రుద్దాడు.. చెంపఛెళ్లుమనిపించా: రాధికా ఆప్టే

సినీ నటీమణుల్లో చాలామంది వరుసగా గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంగతులను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ''మీ టూ'' ద్వారా తమకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స

Advertiesment
Radhika Apte
, బుధవారం, 14 మార్చి 2018 (15:46 IST)
సినీ నటీమణుల్లో చాలామంది వరుసగా గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంగతులను బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ''మీ టూ'' ద్వారా తమకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
ఓ ప్రముఖ దక్షిణాది హీరో తనతో అభ్యంతరకంగా ప్రవర్తించాడని.. అతడి చెంపఛెళ్లుమనిపించానని గతంలో చెప్పుకొచ్చిన రాధికా ఆప్టే.. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొన్న తొలి రోజే సదరు హీరో తన పక్కనే కూర్చుని.. తన కాలిని అభ్యంతరకర రీతిలో రుద్దాడని సంచలన ఆరోపణలు చేసింది. 
 
తాను నటించిన తొలి దక్షిణాది సినిమా షూటింగ్‌‌లోనే తనకు ఈ అనుభవం ఎదురైందని, అంతకుముందు సదరు హీరోతో కనీస పరిచయం కూడా లేదని చెప్పుకొచ్చింది. ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంపచెళ్లుమనిపించానని రాధిక వివరించింది. కాగా రాధికా ఆప్టే లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాల్లో నటించింది. తమిళంలో ''కబాలి'' సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్ష‌న్‌లో ఎన్టీఆర్..? ఎందుకు?