Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకట్టుకుంటోన్న 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' స్పూఫ్ షార్ట్ ఫిల్మ్

Advertiesment
spooph short film
, ఆదివారం, 31 డిశెంబరు 2023 (17:02 IST)
ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలోనే తమ తమ టాలెంట్‌ను అంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే అన్ని చోట్లా ఏలేస్తున్నారు. అలా 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ షార్ట్ ఫిల్మ్ వచ్చింది.
 
యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో స్పూఫ్‌లకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అసలే దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. ఇక పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్ అంటూ 7 ఆర్ట్స్ ఓ స్పూఫ్ చేసింది. పుష్పలోని పాత్రలను పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉంటాయి. పుష్ప రాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ నటించారు. అయితే పుష్ప పాత్రలో శ్రీకాంత్ రెడ్డి నటించడమే కాకుండా.. ఈ స్పూఫ్‌కు కర్త కర్మ క్రియ అన్నీ కూడా అతనే కావడం విశేషం.
 
ఈ కాన్సెప్ట్ రాసుకుని, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా శ్రీకాంత్ రెడ్డి చేసుకోవడంతో అతని మల్టీ టాలెంట్ అందరికీ అర్థం అవుతుంది. తాజాగా ఈ స్పూఫ్‌ షార్ట్ ఫిల్మ్‌కి మంచి వ్యూస్ వస్తున్నాయి. పుష్ప 2 కాన్సెప్ట్‌ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్‌ను ఎంచుకున్నాడు. షెకావత్ తనను బ్రాండ్ అంటూ అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ బాగుంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస బాగుంది. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. ఈ స్ఫూప్ ఎంతో ఫన్నీగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన సినీ సెలెబ్రిటీలు