Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరి జగన్నాథ్‌ 'రోగ్‌'లో హీరోయిన్స్‌ డబుల్‌ ధమాకా

'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప

పూరి జగన్నాథ్‌ 'రోగ్‌'లో హీరోయిన్స్‌ డబుల్‌ ధమాకా
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (16:03 IST)
'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌' (మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. 
 
అనుష్క, అసిన్‌, హన్సిక, రక్షిత, దిశా పటాని, కంగనా రనౌత్‌, శియా గౌతమ్‌, నేహాశర్మ, సమీక్ష, అయేషా టకియా, అదాశర్మ వంటి గ్లామరస్‌ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్‌ 'రోగ్‌' చిత్రం ద్వారా డబుల్‌ ధమాకాగా ఇద్దరు హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నారా చోప్రా, ఏంజెలా నటిస్తున్నారు. తన ప్రతి సినిమాలోనూ హీరోయిన్లను ఎంతో గ్లామర్‌గా చూపించే పూరి ఈ సినిమా కాస్త డోస్‌ పెంచి ఇద్దరు హీరోయిన్లతో కనువిందు చేయబోతున్నారు. 
 
'రోగ్‌' అనే డిఫరెంట్‌ టైటిల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పూరి డిఫరెంట్‌ ప్రమోషన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచుతున్నారు. 'రోగ్‌' మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఫిబ్రవరి 19వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ఈ చిత్రంలోని హీరోయిన్స్‌ మన్నారా చోప్రా, ఏంజెలా స్టిల్స్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో ఇషాన్‌ హీరోగా నటిస్తుండగా, మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ అంటూ "ఘాజీ"పై అగ్ర దర్శకుల ప్రశంసలు