‘నేనొస్తా’ టీజర్ సూపర్.. పూరీ జగన్నాథ్ కితాబు
రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్ సమర్పణలో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక ప్లవి ప్రధాన పాత్రలో పరంధ్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనొస్తా’. బాషా మజహర్ నిర్మాత.
రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్ సమర్పణలో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక ప్లవి ప్రధాన పాత్రలో పరంధ్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనొస్తా’. బాషా మజహర్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కెళ్లిన ఈ చిత్రం యొక్క టీజర్‌ని ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సంస్థ కార్యాయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీజర్ చాలా బాగుంది. మంచి క్వాలిటీతో తీసిన నేనొస్తా టీజర్, పోస్టర్స్ చూస్తుంటే సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా ఉన్నాయి. నాకు బేసికల్‌గా థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. ఆ కోవలోకే చెందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాని కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ముందుగా మా చిత్రం టీజర్‌ని రిలీజ్ చేసిన పూరి జగన్నాథ్ కృతజ్ఞతలు. ఇక ఈ చిత్రం ఆద్యంతం థ్రిల్లింగ్‌తో నడుస్తుంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాము. థియేటర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇందులోని నటీనటుల అందరూ ఎంతో చక్కగా నటించారు. ప్రస్తుతం మా సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ చిత్రంలో జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, ప్రియాంక పల్లవి, సంధ్యాజనక్, బిహెచ్‌ఇఎల్ ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: ఎస్ జె.శివకిరణ్; సంగీతం: అనురాగ్ వినీల్; కెమెరా: శివారెడ్డి; మాటలు, రచనా సహకారం: బాషా మజహర్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బల్లా హనుమ; నిర్మాత: బాషా మజహర్; రచన, దర్శకత్వం: పరంద్ కళ్యాణ్.