Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వడ్డీ మాఫియా కింగ్ అన్బు.. అజిత్‌ను గదిలో బంధించి.. మీటర్ వడ్డీ అడిగాడట..

సినీ రంగాన్ని వడ్డీ మాఫియా కుదిపేస్తోంది. తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఫైనాన్షియర్ల అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. అశోక్ ఆత్మహత్యకు ఫైనాన్షియర్ అన్భుచెళియనే కారణమని పోలీసులకు ఫిర్య

ajith kumar
, గురువారం, 23 నవంబరు 2017 (12:02 IST)
సినీ రంగాన్ని వడ్డీ మాఫియా కుదిపేస్తోంది. తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఫైనాన్షియర్ల అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో.. అశోక్ ఆత్మహత్యకు ఫైనాన్షియర్ అన్భుచెళియనే కారణమని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అన్భు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు నిర్మాతల మండలి, సినీ తారలు అన్భు చెళియన్‌పై గుర్రుగా వున్నారు. 
 
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నటుడు విశాల్ ఇప్పటికే అన్భు చెళియన్‌కు శిక్షపడేలా చేయాలని పోలీసులను కోరాడు. ఈ అన్భు చెళియన్‌కు మద్దతుగా ఎవరొచ్చినా వదిలిపెట్టమని.. మంత్రులు అన్బు చెళియన్‌కు మద్దతిస్తే వారినీ వదిలేది లేదన్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ మాఫియా కింగ్ అన్బు చెళియన్ లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అన్భు చెళియన్ దెబ్బకు నిర్మాతలే కాకుండా తమిళ అగ్ర హీరో అజిత్, నటి దేవయాని సహా పలువురు ప్రముఖులు ఎన్నో ఇబ్బందులు పడ్డారట. 
 
అన్బు వేధింపులు తాళలేక 2003 మే 3వ తేదీన నిర్మాత జి.వెంకటేశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఆ ఘటన పెను సంచలనం సృష్టించింది. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం దృష్టికి ఆ విషయాన్ని నిర్మాతలు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అన్నాడీఎంకేతో అన్బుకు సంబంధాలున్నట్లు సమాచారం. ఇక కోలీవుడ్ అగ్ర హీరో అజిత్.. గతంలో నటించిన నాన్ కడవుల్ సినిమాకు గాను అడ్వాన్స్ తీసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి అజిత్ తప్పుకున్నాడు. 
 
ఒప్పందం ప్రకారం తీసుకున్న అడ్వాన్సును వడ్డీ సహా చెల్లించేందుకు అజిత్ సమ్మతించాడు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన అన్బు చెళియన్ మీటరు వడ్డీ ఇవ్వాలంటూ అడ్డుతగిలాడు. అంతేకాదు, అజిత్‌ను గదిలో కూడా నిర్బంధించాడు. ఈ ఘటనతో కోలీవుడ్ షాక్‌కు గురైంది. ఆ తర్వాత కొందరు సినీ ప్రముఖులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. 
 
నటి దేవయాని విషయానికి వస్తే, అన్బు దగ్గర ఆమె రుణం తీసుకుని కట్టలేక టీవీ సీరియల్స్‌లో కూడా నటించిందని సమాచారం. ఇకపోతే.. అన్బు చెళియన్ కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని.. గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మావతిపై పరిపూర్ణానంద కామెంట్స్