Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసిన పులి మేక టీజర్

puli meka look
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (18:30 IST)
puli meka look
ప్ర‌ధాన పాత్ర‌ల్లో లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌, సిరి హ‌న్మంత్ నటించిన పులి మేక’ టీజర్ ను రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. సాధార‌ణంగా నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. మ‌రి వారినే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు?  భ‌యంక‌ర‌మైన ప‌నులు చేసే వ్య‌క్తిని మృగం అంటుంటాం. మృగంలాంటి వేషంతో ఓ వ్య‌క్తి అలాంటి ప‌నులు చేస్తే దాన్నెమ‌నాలి. అలాంటి మృగంలాంటి మ‌నిషి సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌ను చేస్తుంటాడు. అయితే అత‌ని టార్గెట్ సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం కాదు.. ఏకంగా పోలీసులే. త‌మ డిపార్ట్‌మెంట్ అధికారుల‌ను ఎవ‌రో ఓ వ్య‌క్తి వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? అనే విష‌యాలు తెలియాలంటే జీ 5లో ఫిబ్ర‌వ‌రి 24న స్ట్రీమింగ్ కాబోతున్న‌ ‘పులి మేక’ ఒరిజిన‌ల్ చూడాల్సిందే. 
 
ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్ర‌రీలో ఫిబ్ర‌వ‌రి 24న‌ మ‌రో బెస్ట్ ఒరిజిన‌ల్‌గా జాయిన్ కావ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది ‘పులి మేక’. ఈ ఒరిజిన‌ల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌తో జాయిన్ అయ్యింది. లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్‌, సిరి హ‌న్మంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే జీ 5లో స్ట్రీమింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్లింగ్‌ ఒరిజిన‌ల్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినంద‌న‌లు తెలిపారు. 
 
‘పులి మేక’ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే .. పోలీసుల‌ను మృగంలాంటి వేష‌ధార‌ణ‌తో ఉన్న వ్య‌క్తి వ‌రుసగా చంపేస్తుంటాడు. అస‌లు ఈ హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేస్తున్నార‌నేది తెలియ‌క డిపార్ట్మెంట్ త‌ల‌లు ప‌ట్టుకుంటుంది. వెంట‌నే కేసుని సాల్వ్ చేయ‌టానికి, హంత‌కుడిని ప‌ట్టుకోవ‌టానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. దానికి హెడ్ కిర‌ణ్ ప్ర‌భ (లావ‌ణ్య త్రిపాఠి). అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబ‌ర్ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ (ఆది సాయికుమార్) క‌నిపిస్తున్నారు. కేసుని సాల్వ్ చేయ‌టానికి పోలీసులు క‌ష్ట‌ప‌డుతుంటే మ‌రో వైపు మీడియా, పై అధికారుల నుంచి తెలియ‌ని ఒత్తిడి వారిపై ఉంటుంది. ఈ స‌న్నివేశాల‌ను చాలా ఇంట్రెస్టింగ్ వేలో టీజ‌ర్‌గా క‌ట్ చేశారు. 
 అస‌లు ఈ హంత‌కుడు ఎవ‌రు? ఎందుక‌లా పోలీసుల‌ను టార్గెట్ చేశాడనేది తెలియాలంటే ఫిబ్ర‌వ‌రి 24 వ‌ర‌కు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు అనారోగ్యంతో విజయ్ దేవరకొండ రేపు గచ్చిబౌలికి రానున్నాడు