Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఐరెన్ లెగ్'తో అల్లు అర్జున్... ఏం జరుగుతుందబ్బా....?

అల్లు అర్జున్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న 'డీజే- దువ్వాడ జగన్నాథం' చిత్రం షూటింగ్‌ ఇంకా సెట్‌పైకి వెళ్ళలేదు. ఇందులో కథానాయికగా ఎవరిని నిర్ణయించాలో కొద్దిరోజులుగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలన

Advertiesment
puja hegde
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (20:55 IST)
అల్లు అర్జున్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న 'డీజే- దువ్వాడ జగన్నాథం' చిత్రం షూటింగ్‌ ఇంకా సెట్‌పైకి వెళ్ళలేదు. ఇందులో కథానాయికగా ఎవరిని నిర్ణయించాలో కొద్దిరోజులుగా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను దాదాపుగా పూర్తిచేసుకొని వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇక ఈ సినిమా అనౌన్స్‌ అయిన రోజు నుంచే అల్లు అర్జున్‌ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా చాలామంది స్టార్‌ హీరోయిన్ల పేర్లే వినిపించినా, చివరగా, దర్శకనిర్మాతలు పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఖరారు చేశారు. 'ఒక లైలా కోసం', 'ముకుందా' సినిమాలలో నటించిన పూజా హెగ్డే, బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమా 'మోహెంజోదారో' అవకాశం సొంతం చేసుకొని కొద్దినెలల క్రితం అందరినీ ఆశ్చర్యపరిచారు. 
 
కాగా హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలై పూజా హెగ్డేకి నిరాశనే మిగిల్చింది. దీంతో ఆమెను అంతా ఐరెన్ లెగ్ అంటూ కామెంట్లు చేశారు. ఇదే సమయంలో ఆమెకు అల్లు అర్జున్‌ సినిమాలో అవకాశం దక్కడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఆమెది ఐరెన్ లెగ్ అవుతుందో గోల్డెన్ లెగ్‌గా మారుతుందో చూడాలి. ఎందుకంటే గతంలో శ్రుతి హాసన్‌ను చానాళ్లు ఐరెన్ లెగ్ అంటూ గేలి చేసినవాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఆమెది గోల్డెన్ లెగ్ అయింది. అలాగే అల్లు అర్జున్ సినిమాతో పూజాది గోల్డెన్ లెగ్ అవుతుందేమో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌ పార్వతిదేవీ వెండితెరపైకి వచ్చింది!