Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా దుస్తుల వెనక ఏముందో చూడలేరు.. పైగా విమర్శలా: గయ్‌‌మన్న భామ

బాలీవుడ్ హీరోయిన్లలో ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ఒకరు. ఏ విషయమైనా ఎలాంటి తడబాటు, భయం లేకుండా మాట్లాడటం ఈమెకు అలవాటు. ఇటీవల ముంబైలో జరిగిన ఈ ఈవెంట్లో సోనమ్ ధరించిన బ్లాక్ జంప్ సూట్ దుస్తులపై వివాదం రాజుకుంది. తనను అసభ్య కోణంలో రిపోర్టు చేశారని ఆమె ఆరోపి

Advertiesment
Sonam Kapoor
హైదరాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (01:20 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ఒకరు. ఏ విషయమైనా ఎలాంటి తడబాటు, భయం లేకుండా మాట్లాడటం ఈమెకు అలవాటు. ఇటీవల ముంబైలో జరిగిన ఈ ఈవెంట్లో సోనమ్ ధరించిన బ్లాక్ జంప్ సూట్ దుస్తులపై వివాదం రాజుకుంది. తనను అసభ్య కోణంలో రిపోర్టు చేశారని ఆమె ఆరోపించారు. ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకునే ప్రసక్తేలేదని తన శరీరంపై తాను చాలా గర్వంగా ఫీలవుతున్నానంటూ ట్వీట్ చేసింది. తాను ఎన్నో సమస్యలపై చర్చిస్తానని.. అయితే అలాంటి విషయాలను పక్కనపెట్టి తన డ్రెస్సుపై చర్చ అవసరమా అని ప్రశ్నించింది. సౌకర్యంగా ఉన్న దుస్తులనే తాను ధరించినట్లు స్థానిక మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
 
'నా దుస్తుల వెనక ఏముందో ప్రజలు చూడలేకపోయారన్నది వాస్తవం. మంచి డ్రెస్ వేసుకున్నాననేది నా ఉద్దేశం. అందుకే ఇది నా సమస్య మాత్రం కాదు. వేసుకునే దుస్తులను బట్టి ఒకరిపై అభిప్రాయం మారితే అది చూసేవారి దృష్టికోణాన్ని భయటపెడుతుందని' సోనమ్ అంటోంది. డ్రెస్సు వివాదంలో తనకు మద్దతు తెలిపిన తోటి నటీమణులు భూమి ఫడ్నేకర్, సోషీ చాదరీలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో ట్వీట్ చేసింది సోనమ్. 
ఫెమినా ఇంటర్వ్యూలో తాను 13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని, బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆడవారి పట్ల వివక్షత లాంటి ఎన్నో విషయాలపై తాను మాట్లాడుతూండగా కేవలం ఇలాంటి మామూలు విషయాలపై వివాదం అవసరమా అని ప్రశ్నించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బింగ్ 'బాహుబలి-2' రిలీజ్ చేస్తే థియేటర్లు తగలబెడతారేమో? : కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ